సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్ లను దంచేసిన భాగ్యశ్రీ బోర్సే.. వీడియో వైరల్

లెనిన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్‌ భాగ్యశ్రీ బోర్సే ఓ ఇంటర్వ్యూలో సీనియర్‌ ఎన్టీఆర్‌ దానవీరశూరకర్ణ సినిమాలోని ఫేమస్ డైలాగ్ ‘ఆచార్యదేవా! ఏమంటివి? ఏమంటివి?’ డైలాగ్ లను అలవోకగా చెప్పేసి అందరిని మెస్మరైజ్ చేసింది.

అఖిల్‌ హీరోగా వస్తున్న ‘లెనిన్‌’ సినిమా హీరోయిన్‌ భాగ్యశ్రీ బోర్సే నెట్టింట ఆ సినిమా ప్రమోషన్స్ తో ట్రెండ్ లో కొనసాగుతుంది. జులై 10న లెనిన్ మూవీ థియేటర్లలోకి రానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన యాంకర్ సుమ నిర్వహించిన ఇంటర్వ్యూలో సీనియర్‌ ఎన్టీఆర్‌ దానవీరశూరకర్ణ సినిమాలోని ఫేమస్ డైలాగ్ ‘ఆచార్యదేవా! ఏమంటివి? ఏమంటివి?’ డైలాగ్ లను అలవోకగా చెప్పేసి అందరిని మెస్మరైజ్ చేసింది.

ఆ డైలాగ్ లు చెప్పడంలో భాగ్యశ్రీ టాలెంట్ చూసి పక్కనే ఉన్న అఖిల్, యాంకర్ సుమ సైతం షాక్ అయ్యారు. ఆమె మాతృభాష తెలుగు కాకపోయినా చాలా స్పష్టంగా ఆ డైలాగ్‌ చెబుతూ అదిరిపోయే రేంజ్‌లో ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చింది.

భాగ్యశ్రీ బోర్సే మహారాష్ట్ర పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. నైజీరియాలోని లాగోస్ లో భాగ్యశ్రీ బోర్సే చదువుకుంది. భారతదేశం తిరిగి వచ్చి ఆమె బిజినెస్ మేనేజ్మెంట్ డిగ్రీలో చేరింది. మోడల్ గా కెరియర్ ప్రారంభించి, హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ఆమె చందు ఛాంపియన్ లోనూ నటించింది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ బచ్చన్ (2024) చిత్రంలో రవితేజ సరసన ఆమె నటించింది. కింగ్ డమ్, కాంతా, ఆంధ్రాకింగ్ తాలుకాలో నటించింది.

లెనిన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా భాగ్యశ్రీ బోర్సే ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్ లను చెప్పిన తీరుతో..తను గ్లామర్ డాల్ మాత్రమే కాదు..ఫెర్ఫార్మెన్స్ యాక్టర్ కూడా అనిపించుకుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అంతేకాదు ఇదే ఇంటర్వ్యూలో నా మొదటి ఇల్లు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ అయితే, హైదరాబాద్ నా రెండో ఇల్లు. అది ఇప్పటికే ఫిక్స్ అయిపోయింది అని ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఈ వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని పలువురు నెటిజన్లు, అభిమానులు భాగ్యశ్రీ త్వరలో తెలుగింటి కోడలిగా మారబోతుందా? అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు అభిమానులు అయితే రామ్‌తో ఆమె ప్రేమబంధం నిజమేనని సోషల్ మీడియాలో పోస్టులు కూడా చేస్తున్నారు.

 

Latest News