నా వీడియో దెబ్బకు నా ఓటు హక్కుపై మాట మార్చారు: ప్రకాశ్ రాజ్

తన ఓటు తొలగించారని వీడియో చేయడంతో అధికారులు మాట మార్చారని నటుడు ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. ఓటు స్థితిని ‘షిఫ్టెడ్’గా మార్చారని విమర్శించారు.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Aug 13, 2026, 2:18 pm IST
Read Time: 4 mins
నా వీడియో దెబ్బకు నా ఓటు హక్కుపై మాట మార్చారు: ప్రకాశ్ రాజ్

విధాత : నా ఓటును తొలగించారని నేను వీడియో చేయడంతో..వెంటనే ఓటు తొలగించలేదని, ‘షిఫ్టెడ్’ జాబితాకు మార్చడం జరిగిందని ఎన్నికల అధికారులు మాట మార్చారని, అదే కామ‌న్ మ్యాన్ ఎవ‌రితో చెప్పుకోవాలని సినీ నటుడు ప్ర‌కాశ్ రాజ్ ప్రశ్నించారు. అంతకుముందు బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి తన పేరు తొలగించారని నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించింది. పాత చిరునామాలో ఉండకపోవడంతో ఆయన ఓటు స్థితిని ‘షిఫ్టెడ్’ జాబితాకు మార్చడం జరిగిందని ఎన్నికల అధికారులు తెలిపారు. ప్రస్తుత కొత్త చిరునామా వివరాలతో ఫారం-6 సమర్పిస్తే ఆయన తన ఓటు హక్కును తిరిగి పొందవచ్చని స్పష్టం చేశారు.

ఈసీ అధికారులపై ప్రకాశ్ రాజ్ తీవ్ర విమర్శలు

తన ఓటు విషయంలో ఈసీ అధికారులు పచ్చి అబద్ధాలు చెప్తున్నారని నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్ర విమర్శలు చేశారు. తన ఓటు తొలగించారని వీడియో చేసిన తర్వాత అధికారులు ఫోన్ చేసి పొరపాటు జరిగిందని చెప్పారని, ఆ కాల్ రికార్డింగ్స్ తన వద్ద ఉన్నాయని తెలిపారు. వెబ్‌సైట్‌లో హడావిడిగా ‘షిఫ్టెడ్’గా మార్చి, తాను అబద్ధం చెప్పినట్లు చిత్రీకరించారని ఆరోపించారు. త్వరలో అన్ని ఆధారాలతో ప్రెస్‌మీట్ పెడతానని స్పష్టం చేశారు. తాను పోస్ట్‌ చేసిన వీడియోను తొలగించి.. పొరపాటు జరిగిందని మళ్లీ వీడియో పోస్ట్‌ చేయాలని అధికారులు నన్ను కోరడం జరిగిందని ప్రకాశ్‌ రాజ్‌ వెల్లడించారు. వెబ్‌సైట్‌లో హడావిడిగా ‘షిఫ్టెడ్‌’గా మార్చి.. తనను అబద్ధాలు చెప్పినట్లు చిత్రీకరించిన ఎన్నికల అధికారులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రకాశ్‌ రాజ్‌ మండిపడ్డారు.