Rakesh Bedi | సక్సెస్ మీట్‌లో ముద్దు.. రాకేశ్ బేడీపై నెటిజన్ల ట్రోల్స్, వివరణ ఇచ్చిన నటుడు
Rakesh Bedi | సెలబ్రిటీల ప్రతి కదలిక సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంది. ముఖ్యంగా పబ్లిక్ ఈవెంట్స్‌లో వారి ప్రవర్తనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తుంటారు. తాజాగా అలాంటి పరిస్థితే బాలీవుడ్ సీనియర్ నటుడు రాకేశ్ బేడీకి ఎదురైంది. తనకంటే చాలా చిన్న వయసున్న హీరోయిన్ సారా అర్జున్‌కు స్టేజీపైనే ముద్దు పెట్టడం సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపింది.
Rakesh Bedi | సెలబ్రిటీల ప్రతి కదలిక సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంది. ముఖ్యంగా పబ్లిక్ ఈవెంట్స్‌లో వారి ప్రవర్తనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తుంటారు. తాజాగా అలాంటి పరిస్థితే బాలీవుడ్ సీనియర్ నటుడు రాకేశ్ బేడీకి ఎదురైంది. తనకంటే చాలా చిన్న వయసున్న హీరోయిన్ సారా అర్జున్‌కు స్టేజీపైనే ముద్దు పెట్టడం సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపింది.దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘దురంధర్’ సక్సెస్ మీట్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. రణవీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై భారీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో నిర్వహించిన సక్సెస్ ఈవెంట్‌లో స్టేజీపైకి వస్తున్న హీరోయిన్ సారా అర్జున్‌ను చూసిన రాకేశ్ బేడీ ఆమె వద్దకు వెళ్లి ముద్దు పెట్టాడు.
ఆ క్షణాన్ని వీడియోగా రికార్డ్ చేసిన నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది.వీడియో బయటకు రావడంతో నెటిజన్లు రాకేశ్ బేడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “కూతురు వయసున్న అమ్మాయితో ఇలా ప్రవర్తించడం తగునా?”, “స్టేజీపై ఇలా చేయడం అవసరమా?” అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తాయి. కొందరు అయితే ఈ చర్యను అసభ్యకరమని కూడా వ్యాఖ్యానించారు.ఈ విమర్శలు తన దాకా చేరడంతో రాకేశ్ బేడీ స్పందించారు. ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ.. “దురంధర్ సినిమాలో నేను, సారా తండ్రీకూతుళ్ల పాత్రల్లో నటించాం. ఆ అనుబంధంతోనే స్టేజీపై ఆమెకు ఒక తండ్రి ప్రేమగా ముద్దు పెట్టాను. ఇందులో ఎలాంటి తప్పు లేదా దురుద్దేశం లేదు” అని తెలిపారు. తాను పూర్తిగా ఆత్మీయతతోనే అలా చేశానని, దీనిని వేరే కోణంలో చూడాల్సిన అవసరం లేదన్నారు.
రాకేశ్ బేడీ వివరణ ఇచ్చినప్పటికీ, ఈ అంశంపై సోషల్ మీడియాలో చర్చ మాత్రం ఆగడం లేదు. కొందరు ఆయన మాటలను సమర్థిస్తుంటే, మరికొందరు పబ్లిక్ ప్లేస్‌లో ఇలాంటి ప్రవర్తన సరికాదని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, ఒక చిన్న సంఘటన బాలీవుడ్‌లో మరోసారి సెలబ్రిటీల ప్రవర్తనపై చర్చకు దారితీసింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram