Alia Bhatt | కేన్స్ రెడ్ కార్పెట్‌పై అలియా మ్యాజిక్.. ఐస్ బ్లూ గౌన్‌లో యువరాణిలా మెరిసిన బాలీవుడ్ బ్యూటీ

Alia Bhatt |ప్రపంచ సినీ రంగం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ మరోసారి తన స్టైల్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. 2026 కేన్స్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై అలియా చేసిన ఎంట్రీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఆమె ధరించిన ఐస్ బ్లూ గౌన్ అభిమానులను మంత్రముగ్ధులను చేస్తోంది.

  • By: Sandeep |    movies |    Published on : May 14, 2026 11:17 AM IST
Alia Bhatt | కేన్స్ రెడ్ కార్పెట్‌పై అలియా మ్యాజిక్.. ఐస్ బ్లూ గౌన్‌లో యువరాణిలా మెరిసిన బాలీవుడ్ బ్యూటీ

Alia Bhatt |ప్రపంచ సినీ రంగం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ మరోసారి తన స్టైల్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. 2026 కేన్స్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై అలియా చేసిన ఎంట్రీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఆమె ధరించిన ఐస్ బ్లూ గౌన్ అభిమానులను మంత్రముగ్ధులను చేస్తోంది.

‘ఏ ఉమెన్స్ లైఫ్’ ప్రీమియర్ సందర్భంగా అలియా ఈ ప్రత్యేక లుక్‌లో కనిపించింది. ప్రముఖ డిజైనర్ డానియల్ ఫ్రాంకెల్ రూపొందించిన ఈ గౌన్ అలియాకు ఫెయిరీ టేల్ ప్రిన్సెస్ లుక్‌ను తీసుకొచ్చింది. రెడ్ కార్పెట్‌పై ఆమె నడుస్తుండగా అక్కడున్న కెమెరాలన్నీ ఒక్కసారిగా ఆమె వైపే తిరిగాయి.

యువ‌రాణిలా అలియా..

ఈ గౌన్ ప్రత్యేకత ఏమిటంటే.. పై భాగం పూర్తిగా ఫిటెడ్ స్టైల్‌లో ఉండగా, కింద భాగంలో లేయర్ల రూపంలో డిజైన్ చేసిన టల్లే స్కర్ట్ ఆమెకు రాయల్ లుక్‌ను ఇచ్చింది. సింపుల్‌గా చెప్పాలంటే ఆధునిక కాలపు యువరాణిలా అలియా కనిపించిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

డ్రెస్‌తో పాటు అలియా స్టైలింగ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మెడకు ధరించిన లేస్ చోకర్ ఆమె లుక్‌ను మరింత ఎలివేట్ చేసింది. మేకప్‌ను చాలా నేచురల్‌గా, గ్లోయింగ్ ఫినిష్‌తో ప్లాన్ చేయగా.. హెయిర్ స్టైల్ కూడా క్లాసీగా కనిపించింది. జుట్టును పైకి ముడివేసి, కొన్ని వెంట్రుకలను ముఖం చుట్టూ వదిలేయడంతో ఆమెకు సాఫ్ట్ అండ్ ఎలిగెంట్ లుక్ వచ్చింది.

అభిమానుల ప్ర‌శంస‌లు..

ఇప్పుడు అలియా కేన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “రెడ్ కార్పెట్‌పై నిజమైన స్టార్”, “ప్రిన్సెస్ వైబ్స్”, “అలియా మరోసారి ఫ్యాషన్ గోల్స్ సెట్ చేసింది” అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. అలియా ప్రస్తుతం దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ‘లవ్ అండ్ వార్’ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ కీలక పాత్రల్లో కనిపించనుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం 2027 జనవరిలో విడుదల కానుంది.

దీనితో పాటు అలియా ‘ఆల్ఫా’ అనే స్పై థ్రిల్లర్‌లో కూడా నటిస్తోంది. వరుస భారీ ప్రాజెక్టులతో కెరీర్‌లో దూసుకెళ్తూనే, మరోవైపు ఫ్యాషన్ ప్రపంచంలోనూ తన ప్రత్యేక గుర్తింపును నిలబెట్టుకుంటోంది అలియా భట్. మొత్తానికి కేన్స్ 2026 రెడ్ కార్పెట్‌పై అలియా చేసిన ఈ స్టైలిష్ ఎంట్రీ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.