Filmfare Awards 2025| ఫిల్మ్ ఫేర్ అవార్డ్సులో ‘లాపతా లేడీస్‌’ హవా!

0వ ఫిల్మ్‌ఫేర్‌-2025 అవార్డుల ప్రధానోత్సవంలో ‘లాపతా లేడీస్‌’ మూవీ సత్తా చాటింది. బెస్ట్ మూవీ, బెస్ట్‌ డైరెక్టర్‌, బెస్ట్‌ స్క్రీన్‌ప్లే.. ఇలా ఏకంగా 13విభాగాల్లో ఈ సినిమా అవార్డులను ఎగరేసుకుపోయింది.

Filmfare Awards 2025| ఫిల్మ్ ఫేర్ అవార్డ్సులో ‘లాపతా లేడీస్‌’ హవా!

విధాత : 70వ ఫిల్మ్‌ఫేర్‌-2025 అవార్డుల(Filmfare Awards 2025) ప్రధానోత్సవంలో ‘లాపతా లేడీస్‌’(Lapata Ladies) సత్తా చాటింది. బెస్ట్ మూవీ, బెస్ట్‌ డైరెక్టర్‌, బెస్ట్‌ స్క్రీన్‌ప్లే.. ఇలా ఏకంగా 13విభాగాల్లో ఈ సినిమా అవార్డులను ఎగరేసుకుపోయింది. ఫిల్మ్‌ఫేర్‌ ఉత్తమ నటి అవార్డును అలియా భట్‌(జిగ్రా), ఉత్తమ నటుడి పురస్కారాన్ని అభిషేక్‌ బచ్చన్‌ (ఐ వాంట్‌ టు టాక్‌), కార్తీక్‌ ఆర్యన్‌ (చందు: ఛాంపియన్‌) అందుకున్నారు.

గుజరాత్ అహ్మదాబాద్‌లోని ఈకేఏ అరీనా స్టేడియంలో శనివారం 70వ ఫిల్మ్‌ఫేర్‌-2025 అవార్డుల ప్రధానోత్సవం వేడుక అట్టహాసంగా జరిగింది. షారుక్‌ఖాన్‌, కరణ్‌ జోహార్‌, మనీష్‌ పాల్‌ హోస్ట్‌లుగా వ్యహరించారు. వేడుకలలో అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, అనన్య పాండే, కృతి నసన్, సిద్దాంత్ చతుర్వేదిలు తమ స్పెషల్ పెర్ఫార్మన్స్తో అలరించారు. టైమ్స్ గ్రూప్ , గుజరాత్ టూరిజంలు సంయుక్తంగా ఈ వేడుకలను నిర్వహించాయి.

మరికొన్ని అవార్డుల వివరాలు

బెస్ట్‌ యాక్టర్ మేల్‌ (క్రిటిక్స్‌ ఛాయిస్‌): రాజ్‌కుమార్‌ రావ్‌ (శ్రీకాంత్‌ మూవీ)
బెస్ట్‌ యాక్టర్‌ ఫిమేల్‌ (క్రిటిక్స్‌): ప్రతిభ (లాపతా లేడీస్‌)
బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్ మేల్‌: రవి కిషన్‌ (లాపతా లేడీస్‌)
బెస్ట్ సపోర్టింగ్‌ యాక్టర్‌ ఫిమేల్‌: ఛాయా కదమ్‌ (లాపతా లేడీస్‌)
బెస్ట్‌ ఫిల్మ్‌ (క్రిటిక్స్‌): ఐ వాంట్‌ టు టాక్‌ (సూజిత్‌ సర్కార్‌)
బెస్ట్‌ డెబ్యూ యాక్టర్‌ ఫిమేల్‌: నితాన్షీ గోయెల్‌ (లాపతా లేడీస్‌)
బెస్ట్‌ డెబ్యూ యాక్టర్‌ మేల్‌: లక్ష్య (కిల్‌)