Allu Arjun | ‘పుష్ప’ ఫ్రాంచైజీ దూకుడు… రూ.2000 కోట్లకు పైగా కలెక్షన్స్, అల్లు అర్జున్‌కు రికార్డు ఆదాయం!

Allu Arjun | 2021లో విడుదలైన ‘పుష్ప: ది రైజ్’ సినిమా ఎంత ప్ర‌భంజ‌నం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్రత్యేకమైన కథనం, స్టైల్, మాస్ అప్పీల్‌తో అంద‌రిని అల‌రించింది. ఈ చిత్రం భారతదేశంలో అన్ని భాషల్లో కలిపి సుమారు రూ.267.55 కోట్ల నెట్ వసూలు చేయగా, విదేశాల్లో రూ.36.3 కోట్ల గ్రాస్ సాధించింది.

Allu Arjun

Allu Arjun | 2021లో విడుదలైన ‘పుష్ప: ది రైజ్’ సినిమా ఎంత ప్ర‌భంజ‌నం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్రత్యేకమైన కథనం, స్టైల్, మాస్ అప్పీల్‌తో అంద‌రిని అల‌రించింది. ఈ చిత్రం భారతదేశంలో అన్ని భాషల్లో కలిపి సుమారు రూ.267.55 కోట్ల నెట్ వసూలు చేయగా, విదేశాల్లో రూ.36.3 కోట్ల గ్రాస్ సాధించింది. మొత్తంగా రూ.352 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్‌తో భారీ విజయాన్ని అందుకుంది. ఇదే ఈ ఫ్రాంచైజీకి బలమైన పునాది వేసింది.

ఈ విజయాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లింది 2024 డిసెంబర్ 5న విడుదలైన ‘పుష్ప 2: ది రూల్’. ఈ సినిమా విడుదలైన వెంటనే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిసింది. దేశీయంగా రూ.1265.97 కోట్ల నెట్ వసూలు చేయగా, ఓవర్సీస్ మార్కెట్‌లో రూ.292 కోట్ల గ్రాస్ సాధించింది. దీంతో మొత్తం వరల్డ్‌వైడ్ గ్రాస్ కలెక్షన్ రూ.1727.23 కోట్లకు చేరి, భారతీయ సినిమా చరిత్రలోనే అతి పెద్ద హిట్స్‌లో ఒకటిగా నిలిచింది.

గ్లోబ‌ల్ బ్రాండ్..

ఈ రెండు భాగాలను కలిపి చూస్తే, ‘పుష్ప’ ఫ్రాంచైజీ ఇండియాలో రూ.1533.52 కోట్ల నెట్, ప్రపంచవ్యాప్తంగా రూ.2079.23 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ గణాంకాలు ‘పుష్ప’ కేవలం ఒక సినిమా కాదు, గ్లోబల్ బ్రాండ్‌గా మారిందనే విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి.

ఇక ఈ విజయాల్లో ప్రధాన పాత్ర పోషించిన అల్లు అర్జున్ తన పారితోషిక విధానంతో కూడా వార్తల్లో నిలిచారు. సాధారణంగా ఫిక్స్‌డ్ రెమ్యునరేషన్ తీసుకునే బదులు, ఆయన “ప్రాఫిట్ షేర్” మోడల్‌ను అనుసరిస్తున్నారు. నిర్మాత జి. ధనంజయన్ తెలిపిన వివరాల ప్రకారం, సినిమా సంపాదించే ప్రతి రూపాయిలో 30 పైసలు అల్లు అర్జున్‌కు వెళ్తాయి. ఈ ప్రత్యేకమైన స్ట్రాటజీ వల్లే ఆయన ఇతర స్టార్‌లతో పోలిస్తే భిన్నంగా నిలుస్తున్నారు.

స్టార్ హీరోల‌ని మించి..

ఈ మోడల్ కారణంగా ‘పుష్ప’ ఫ్రాంచైజీ ద్వారా అల్లు అర్జున్ దాదాపు రూ.623.76 కోట్ల వరకు సంపాదించినట్లు అంచనా. ఈ మొత్తం చాలా మంది టాప్ స్టార్స్ అయిన షారుఖ్ ఖాన్, ప్రభాస్, రజనీకాంత్‌ల రెమ్యునరేషన్‌లను మించి ఉండటం విశేషం.

ఇంకా ఈ ఒప్పందం నిర్మాతలకు కూడా ప్రయోజనకరంగా మారింది. ముందుగానే భారీ పారితోషికం ఇవ్వాల్సిన అవసరం లేకపోవడం వల్ల బడ్జెట్‌పై ఒత్తిడి తగ్గుతుంది. సినిమా హిట్ అయితే అందరికీ లాభాలు పెరుగుతాయి.

ఇక భవిష్యత్తులో కూడా అల్లు అర్జున్ భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రముఖ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’ అనే సై-ఫై చిత్రం 2027లో విడుదల కానుంది. ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం.

Latest News