Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయనే వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగిన బన్నీ ఇప్పుడు తన ఫోకస్‌ను తమిళ్, హిందీ సినిమాలపై పెట్టినట్లు సమాచారం. వరుసగా భారీ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ పాన్ ఇండియా స్థాయిని మరింతగా విస్తరించాలనే ప్లాన్‌లో ఉన్నాడని తెలుస్తోంది.
ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాకా” సినిమాతో బిజీగా ఉన్న బన్నీ, ఈ మూవీ తరువాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో మరో భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఇదే సమయంలో బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలీ భన్సాలీతో కూడా సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.ఈ పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ కొంతకాలం పాటు టాలీవుడ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి, ఇతర భాషల ప్రాజెక్టులపై దృష్టి సారించనున్నాడని తెలుస్తోంది.
ముఖ్యంగా బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేయాలన్న ఆలోచనతో ఆయన తన నివాసాన్ని కూడా మార్చుకునే ప్లాన్‌లో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్న బన్నీ, త్వరలోనే ముంబైకి పూర్తిగా షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉన్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే “రాకా” షూటింగ్ కారణంగా ముంబైలో ఎక్కువ సమయం గడుపుతున్న ఆయన, అక్కడే స్థిరపడేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ముంబైలో ప్లాట్ కూడా తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నిర్ణయం అమలైతే, భవిష్యత్తులో టాలీవుడ్ దర్శక నిర్మాతలు అల్లు అర్జున్‌ను కలవాలంటే ముంబైకి వెళ్లాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడవచ్చు. అలాగే ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లో జరిగే అభిమానుల సందడి కూడా మారే అవకాశముందని అభిమానులు భావిస్తున్నారు. ముంబై జీవనశైలి, వాతావరణం తనకు నచ్చడం వల్ల ఎప్పటినుంచో అక్కడ స్థిరపడాలని బన్నీ భావిస్తున్నాడని టాక్. ఈ మార్పులో భాగంగా ఆయన భార్య స్నేహా రెడ్డి, పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హ కూడా ముంబైకి వెళ్లనున్నారని సమాచారం.
ఇక “రాకా” సినిమా విషయానికి వస్తే, ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇప్పటికే భారీ అంచనాలను సృష్టించింది. బన్నీ ఇందులో పూర్తి భిన్నమైన లుక్‌లో కనిపించగా, స్పేస్ సైన్స్, ఫిక్షన్ అంశాలతో సినిమా రూపొందుతోందని ప్రచారం జరుగుతోంది. వింత జంతువు తరహా గెటప్‌లో కనిపించిన బన్నీ పాత్రపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
