Ananya Nagalla | ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ట్రెండ్ .. ఇండస్ట్రీలో కొత్త ఆదాయ మార్గాలు, విష్ణు ప్రియ బాట‌లో అనన్య

Ananya Nagalla | సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఆదాయ మార్గాలు కాలక్రమేణా మారుతున్నాయి. ఒకప్పుడు సినిమాలు, టీవీ షోలు, షోరూమ్ ఓపెనింగ్స్ మాత్రమే ప్రధాన ఆదాయ వనరులు కాగా, ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ కొత్త అవకాశాలను తెస్తుంది.

  • By: Sandeep |    movies |    Published on : Apr 19, 2026 11:44 AM IST
Ananya Nagalla | ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ట్రెండ్ .. ఇండస్ట్రీలో కొత్త ఆదాయ మార్గాలు, విష్ణు ప్రియ బాట‌లో అనన్య

Ananya Nagalla | సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఆదాయ మార్గాలు కాలక్రమేణా మారుతున్నాయి. ఒకప్పుడు సినిమాలు, టీవీ షోలు, షోరూమ్ ఓపెనింగ్స్ మాత్రమే ప్రధాన ఆదాయ వనరులు కాగా, ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ కొత్త అవకాశాలను తెస్తుంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ మోడల్ ద్వారా సెలబ్రిటీలు అదనపు ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.

ఈ ట్రెండ్‌లో భాగంగా తాజాగా తెలుగు నటి అనన్య నాగళ్ళ కూడా అడుగుపెట్టినట్లు సమాచారం. తన అభిమానులకు ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ అందించేందుకు ఆమె నెలకు రూ.399తో సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ విధానం ద్వారా అభిమానులతో రిలేష‌న్ పెంచుకోవడంతో పాటు, కొత్త రెవెన్యూ స్ట్రీమ్‌ను సృష్టించుకోవడం లక్ష్యంగా కనిపిస్తోంది.

అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అన‌న్య‌..

ఇదే తరహాలో ఇప్పటికే విష్ణు ప్రియా భీమనేని కూడా సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ను ప్రారంభించి వార్తల్లో నిలిచారు. అయితే, ఆమె వ్యవహారం వివాదాస్పదంగా మారి కేసుల వరకు వెళ్లిన నేపథ్యంలో, ఇప్పుడు అనన్య తీసుకున్న నిర్ణయం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఆమె ఈ ప్లాట్‌ఫారమ్‌ను ఎలా వినియోగించుకుంటారు, ఎలాంటి కంటెంట్ అందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.

‘మల్లేశం’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనన్య నాగళ్ళ, తన నటనతో మంచి గుర్తింపు పొందింది. తరువాత పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’లో కీలక పాత్ర పోషించి మరింత గుర్తింపు సంపాదించింది. ప్రారంభంలో పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలు చేసిన ఆమె, తరువాత ట్రెండ్‌కు అనుగుణంగా గ్లామర్ పాత్రల్లో కూడా నటించడం ప్రారంభించింది. ‘పొట్టేల్’, ‘తంత్ర’ వంటి సినిమాల్లో కూడా నటించి తన కెరీర్‌ను విస్తరించింది.

అనన్య మాత్రమే కాదు, ఈషా రెబ్బా వంటి పలువురు హీరోయిన్లు కూడా ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్‌ను ఉపయోగిస్తూ అభిమానులకు ప్రత్యేక కంటెంట్ అందిస్తున్నారు. ఈ కొత్త ట్రెండ్ వల్ల సినిమా అవకాశాలకే పరిమితం కాకుండా, సోషల్ మీడియా ద్వారా కూడా ఆదాయం పొందే మార్గం హీరోయిన్‌లకు లభిస్తోంది.