Anna Konidela | పవన్ పక్కన ఉంది నేను కాదు.. తాను తీన్‌మార్ సినిమాలో ఎక్కడ ఉందో చెప్పిన అన్నా కొణిదెల
Anna Konidela | సోషల్ మీడియా యుగంలో తప్పుడు సమాచారం ఎంత వేగంగా వ్యాపిస్తుందో మరోసారి స్పష్టమైంది. పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల గురించి గత కొన్నేళ్లుగా నెట్టింట చక్కర్లు కొడుతున్న ఒక పాత ఫోటోపై ఆమె తాజాగా స్పందించారు.
Anna Konidela | సోషల్ మీడియా యుగంలో తప్పుడు సమాచారం ఎంత వేగంగా వ్యాపిస్తుందో మరోసారి స్పష్టమైంది. పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల గురించి గత కొన్నేళ్లుగా నెట్టింట చక్కర్లు కొడుతున్న ఒక పాత ఫోటోపై ఆమె తాజాగా స్పందించారు.
ఆ ఫోటోలో పవన్ కళ్యాణ్ పక్కన ఒక విదేశీ మహిళ కూర్చుని ఉన్న దృశ్యం ఉండగా, చాలా మంది ఆమెనే అన్నా కొణిదెలగా భావిస్తూ వచ్చారు. అయితే ఈ ప్రచారానికి తాజాగా అన్నా చెక్ పెట్టారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా స్పందిస్తూ, “ఆ అందమైన మహిళ నేను కాదు” అని స్పష్టంగా పేర్కొన్నారు.
అంతేకాకుండా, “ఈ తప్పు మొదట ఎవరు చేశారో తెలియదు. ఆ ఫోటోలో ఉన్న మహిళ పేరు డానా మార్క్స్. నేను ఎప్పుడూ మోడల్‌గా కానీ, నటిగా కానీ పనిచేయలేదు” అని క్లారిటీ ఇచ్చారు. దీంతో చాలా కాలంగా కొనసాగుతున్న అపోహలకు తెరపడింది.
చాలామంది పొరబడ్డారు..
నిజానికి ఆ ఫోటో ‘తీన్ మార్’ సినిమా ఆడియో ఫంక్షన్ సమయంలో తీసినదిగా తెలుస్తోంది. అందులో పవన్ కళ్యాణ్ పక్కన ఉన్నది ఆ సినిమాలో ‘మిచెల్’ పాత్ర పోషించిన అమెరికన్ నటి డానా మార్క్స్. ఇద్దరూ విదేశీయులే కావడంతో ప్రేక్షకులు ఇన్నాళ్లూ పొరబడుతూ వచ్చారు.
డానా మార్క్స్ అమెరికాకు చెందిన థియేటర్ ఆర్టిస్ట్, సింగర్‌గా గుర్తింపు పొందారు. ‘తీన్ మార్’ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన ఆమె, ముఖ్యంగా “బార్బీ బొమ్మకి” పాటలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆమె అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీలో నటనలో శిక్షణ ఇస్తూ తన కెరీర్‌ను కొనసాగిస్తున్నారు.
తీన్‌మార్ సమయంలోనే పరిచయం..
ఇక అన్నా కొణిదెల, పవన్ కళ్యాణ్ పరిచయం విషయానికి వస్తే… 2011లో ‘తీన్ మార్’ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ తొలిసారి కలుసుకున్నారు. అన్నా ఆ సమయంలో ప్రొడక్షన్ విభాగంలో పనిచేస్తూ పవన్ దృష్టిలో పడ్డారు. ఆ పరిచయం తర్వాత ప్రేమగా మారి, 2013 సెప్టెంబర్ 30న హైదరాబాద్‌లో వివాహం చేసుకున్నారు.
ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తె పొలెనా అంజనా పవనోవా, కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్. కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూ చాలా కాలం ప్రజల దృష్టికి దూరంగా ఉన్న అన్నా కొణిదెల, ఇటీవల పవన్ కళ్యాణ్ రాజకీయ, కుటుంబ కార్యక్రమాల్లో చురుగ్గా కనిపిస్తున్నారు. వీరిద్దరిలో పవన్ కళ్యాణ్ ముందుగా ప్రపోజ్ చేసినట్టు కూడా అన్నా క్లారిటీ ఇచ్చింది.

X
Google News
Facebook
Instagram
Youtube
Telegram