Anna Konidela | పవన్ కళ్యాణ్ ఇంట్లో నలుగురు స్పెషల్ మెంబర్స్.. పెట్ డాగ్స్‌ను పరిచయం చేసిన అన్నా కొణిదెల

Anna Konidela | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నటుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కుటుంబానికి సంబంధించిన చిన్న విషయాలు కూడా అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తుంటాయి.

Anna Konidela | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నటుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కుటుంబానికి సంబంధించిన చిన్న విషయాలు కూడా అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తుంటాయి. తాజాగా ఆయన భార్య అన్నా కొణిదెల‌ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. తమ ఇంట్లో ఉన్న పెట్ డాగ్స్‌ను పరిచయం చేస్తూ ఆమె షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా మారిన అన్నా కొణిదెల, అప్పుడప్పుడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలను అభిమానులతో పంచుకుంటున్నారు. కుటుంబానికి సంబంధించిన మధుర క్షణాలు, ఆసక్తికర విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటున్నారు.

పెట్స్‌తో ప్ర‌త్యేక అనుబంధం..

తాజాగా ఆమె తమ ఇంట్లో ఉన్న నాలుగు పెట్ డాగ్స్ ఫోటోలను షేర్ చేశారు. మూగ జీవాలంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపిన ఆమె, ప్రతి పెట్‌తో ప్రత్యేక అనుబంధం ఉందని వెల్లడించారు.

అన్నా తెలిపిన వివరాల ప్రకారం, ఇంట్లో మొత్తం నాలుగు పెట్ డాగ్స్ ఉన్నాయట. వాటిలో రెండు టాయ్ పూడల్స్ కాగా, మరో రెండు స్టాండర్డ్ పూడల్స్ అని చెప్పారు. ప్రతి పెట్‌కు ఎంతో ముద్దుగా పేర్లు కూడా పెట్టినట్లు పేర్కొన్నారు.

వాటి పేర్లు ఏంటంటే..

టాయ్ పూడల్స్‌కు “మిలో” మరియు “కప్ కేక్” అని పేర్లు పెట్టగా, స్టాండర్డ్ పూడల్స్‌కు “పీచెస్” మరియు “వాఫెల్స్” అనే పేర్లు పెట్టినట్లు ఆమె వెల్లడించారు. ఈ పేర్లు కూడా అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

పోస్ట్‌లో కనిపించిన ఫోటోల్లో పెట్ డాగ్స్ ఎంతో అందంగా, చురుకుగా కనిపించడంతో అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. “చాలా క్యూట్‌గా ఉన్నాయి”, “పేర్లు కూడా చాలా ప్రత్యేకంగా ఉన్నాయి”, “పవన్ ఇంట్లో కూడా ఇంత పెద్ద పెట్ ఫ్యామిలీ ఉందా?” అంటూ స్పందిస్తున్నారు.

సెలబ్రిటీలు తమ పెంపుడు జంతువులపై ప్రేమ చూపించడం కొత్త విషయం కాకపోయినా, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఇలాంటి విషయాలు అభిమానులకు మరింత దగ్గరగా అనిపిస్తుంటాయి. ప్రస్తుతం అన్నా కొణిదెల షేర్ చేసిన ఈ పెట్ ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

Latest News