Bigg Boss 9 | రీతూ చౌదరిని అలా పంపారేంటి.. వెళ్లే ముందు డీమాన్ పవన్ చెవిలో ఏం చెప్పాడు?
Bigg Boss 9 | బిగ్‌బాస్ తెలుగు సీజన్-9లో రీతూ చౌదరి జర్నీ మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా సాగింది. మొదట హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ప్రేక్షకుల్లో రీతూపై నెగెటివ్ అభిప్రాయం ఎక్కువగా ఉన్నా, టాస్కుల విషయంలో ఆమె చూపించిన కమిట్‌మెంట్ ఆ అభిప్రాయం మారేలా చేసింది.
Bigg Boss 9 | బిగ్‌బాస్ తెలుగు సీజన్-9లో రీతూ చౌదరి జర్నీ మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా సాగింది. మొదట హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ప్రేక్షకుల్లో రీతూపై నెగెటివ్ అభిప్రాయం ఎక్కువగా ఉన్నా, టాస్కుల విషయంలో ఆమె చూపించిన కమిట్‌మెంట్ ఆ అభిప్రాయం మారేలా చేసింది. ఉన్న లేడీ కంటెస్టెంట్లలో టాస్కుల్లో స్ట్రాంగ్ రీతూనే అని ప్రేక్షకులే అంగీకరించారు. అయితే డీమాన్ పవన్‌తో ఉన్న లవ్ ట్రాక్ మాత్రం కొందరికి నచ్చకపోవడంతో ట్రోల్స్ కూడా ఎక్కువయ్యాయి. కానీ వారాలు గడిచేకొద్దీ వీరి రిలేషన్‌పై ఆడియన్స్‌కి కూడా స్పష్టత వచ్చింది. ముఖ్యంగా కెప్టెన్ అయిన వారం నుంచి ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్కులు జరిగే వరకు రీతూ తన వంతు కృషిని 100 శాతం చూపించింది. అలాంటి రీతూని సుమన్ శెట్టి, భరణి, సంజన కంటే ముందే ఎలిమినేట్ చేయడం ప్రేక్షకులకు ఊహించని షాక్ అయ్యింది.
సండే ఎపిసోడ్‌లో రీతూ–సంజన మధ్య జరిగిన ఎలిమినేషన్ రౌండ్‌లో రీతూ ఔట్ అయ్యింది. మొదట బయటకు వెళ్లిపోదామని అనుకున్న రీతూని, “అందరూ బై చెప్పండి” అని సంజన పిలిచింది. “నో… నేను ఫేస్ చేయలేను” అంటూ రీతూ టెన్షన్ పడింది. ఒక్కొక్కరుగా హౌస్‌మేట్స్ ఆమెను హగ్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. నేను టాప్-5లో ఉండలేకపోయాను… ఎందుకు బిగ్‌బాస్…” అంటూ రీతూ కన్నీళ్లు పెట్టుకోగా, ఇమ్మూ ఆమెను ఓదార్చాడు. డీమాన్‌ని పట్టుకుని భావోద్వేగంతో హగ్ చేసుకున్న రీతూ, పవన్‌ని అందరూ జాగ్రత్తగా చూసుకోవాలని హౌస్‌మేట్స్‌ని కోరింది. “కళ్యాణ్, నువ్వు మాట్లాడట్లేదని వాడు ఫీలవుతున్నాడు… ప్లీజ్ మాట్లాడండి” అని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసింది.. గేటు వరకూ రీతూని సాగనంపిన తర్వాత రీతూని హగ్ చేసుకొని చెవిలో చాలా నెమ్మదిగా ఒక మాట చెప్పాడు డీమాన్.
కప్పు తీసుకొని వస్తాను చాలా బాగా ఆడి.. అని రీతూతో అన్నాడు డీమాన్. బాగా ఆడు.. అంటూ రీతూ కూడా హగ్గు ఇచ్చింది. బయట అంతా నువ్వే చూసుకోవాలి.. అని డీమాన్ అనగానే రీతూ తనదైన స్టయిల్లో నవ్వు నవ్వింది. ఇక స్టేజ్ మీద నాగార్జునను చూసే సరికి ఆయనకు గట్టిగా హగ్గు ఇచ్చిన రీతూ, “ఈ హగ్గు కోసం ఎలిమినేట్ అవుదామనుకున్నాను సార్” అని సరదాగా చెప్పి నవ్వులు పూయించింది. “టాప్-5లో ఉండాలని చాలా సార్లు యూనివర్స్‌ని అడిగాను… కానీ ఈ జర్నీ కోసం ఎంతో గ్రేట్‌ఫుల్‌గా ఉన్నాను” అని రీతూ తెలిపింది. జర్నీ వీడియోలో ఆమె–డీమాన్ మూమెంట్స్ హైలైట్ అయ్యాయి. వాటిని చూసి రీతూ ఎమోషనల్ అయ్యింది. ఈ వీడియోలో హౌస్‌లోనూ కళ్యాణ్, డీమాన్ మధ్య సరదా గుసగుసలు నడవడంతో స్టేజ్ మీద నవ్వులు వెల్లివిరిశాయి.తర్వాత నాగ్ అడిగిన టాప్-1 నుంచి టాప్-7 ప్లేస్‌ల్లో రీతూ తన అభిప్రాయాలు చెప్పింది. భరణిని 7వ స్థానంలో పెట్టిన రీతూ, “మీరు ఫైర్‌గా ఉండాలి అనుకున్నాం కానీ దివ్యని నామినేట్ చేసిన విధానం నాకు నచ్చలేదు… మిగతా అన్నీ ఐలవ్యూ” అని చెప్పింది. సుమన్ శెట్టికి 6వ, సంజనకు 5వ, కళ్యాణ్‌కు 4వ స్థానాలు ఇచ్చినా, చివరికి కళ్యాణ్ ప్లేస్ మార్చి ఇమ్మూ–తనూజ మధ్య ఉంచేసింది. “కళ్యాణ్‌కి చాలా పెద్ద ప్లేస్ రావాలి… కానీ నేనే ఇక్కడ నిర్ణయించలేను” అని రీతూ భావోద్వేగంగా చెప్పింది. డీమాన్‌కి నంబర్ 1 ఇచ్చిన రీతూ, “పవన్, కప్పు కొట్టి మా ఇంటికి తెచ్చేయ్” అని ఎమోషనల్‌గా రిక్వెస్ట్ చేసింది. రీతూ చౌదరి ఎలిమినేషన్ బిగ్‌బాస్ సీజన్-9లో భావోద్వేగాలతో నిండిన ముఖ్య ఘట్టంగా నిలిచింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram