Bigg Boss 9 | బిగ్ బాస్ ప్రియులకి షాక్ ఇచ్చిన స్టార్ మా.. సీజన్ చివరలో ఇలా చేశారేంటి?
Bigg Boss 9 | బిగ్‌బాస్ తెలుగు సీజన్-9 గ్రాండ్ ఫినాలేకు కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉండగా… షోకి సంబంధించిన ఒక కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. మొదట్లో నెమ్మదిగా సాగినా ఇప్పుడు రేటింగ్‌లు పుంజుకుని మంచి ట్రాక్‌లో నడుస్తుంది.
Bigg Boss 9 | బిగ్‌బాస్ తెలుగు సీజన్-9 గ్రాండ్ ఫినాలేకు కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉండగా… షోకి సంబంధించిన ఒక కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. మొదట్లో నెమ్మదిగా సాగినా ఇప్పుడు రేటింగ్‌లు పుంజుకుని మంచి ట్రాక్‌లో నడుస్తుంది. అయితే ఈ సారి బిగ్ బాస్ విన్నర్ ఎవరు అనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా విన్నర్ రేస్‌లో ఉన్న తనూజ–కళ్యాణ్‌ల మధ్య పోటీపై ప్రేక్షకుల్లో పెద్ద చర్చ నడుస్తోంది. ఇదే వేళ స్టార్ మా తీసుకున్న నిర్ణయం బిగ్‌బాస్ అభిమానులకు చిన్న షాక్‌లానే మారింది.
టైమింగ్స్ మార్చేసిన స్టార్ మా
ఇప్పటి వరకు సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9.30 గంటలకు బిగ్‌బాస్ ప్రసారం అవుతుండగా, శని–ఆదివారాల్లో 9 గంటలకు టెలికాస్ట్ అవుతోంది. అయితే డిసెంబర్ 8 నుంచి ఈ టైమింగ్స్ మారబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అంటే వర్కింగ్ డేస్‌లో బిగ్‌బాస్ షోని అరగంట లేట్‌గా, అంటే 10 గంటలకు చూడాల్సి ఉంటుంది.
మార్పు ఎందుకు?
స్టార్ మాలో కొత్త సీరియల్ ‘పొదరిల్ల్లు’ డిసెంబర్ 8 నుంచి ప్రారంభం కానుంది. ఈ సీరియల్ ప్రతి రోజూ రాత్రి 9.30 గంటలకు ప్రసారమవుతుంది. దీనికోసమే బిగ్‌బాస్ షోను స్టార్ మా అరగంట వాయిదా వేసింది. ఈ టైమింగ్ ఛేంజ్‌పై సోషల్ మీడియాలో మిక్స్‌డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. ఫినాలే దగ్గర్లో ఉండగా టైమింగ్ మార్చడం సరైన నిర్ణయమా అని కొందరు ప్రశ్నిస్తుండగా… కొత్త సీరియల్ స్టార్ట్ కావడంతో ఇది సహజమేనంటూ మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి… బిగ్‌బాస్ సీజన్ 9 కీలక దశకి చేరుకున్న సమయంలో , టైమింగ్స్ మార్పు అనేది కొంత ఇబ్బిందిని కలిగించే అంశమే అని చెప్పాలి. ప్రస్తుతం హౌజ్‌లో టికెట్ టూ ఫినాలే కోసం హోరా హోరీగా టాస్క్‌లు జరుగుతున్నాయి. ఫినాలేకి చేరుకునే మొదటి కంటెస్టెంట్ ఎవరా అని కూడా ప్రేక్షకులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram