Brahmanandam | ‘పెద్ది’ చికిరి చికిరి సంచలనం .. బ్రహ్మనందం డ్యాన్స్ మైండ్ బ్లాక్ చేస్తుందిగా..!
Brahmanandam | రామ్ చరణ్ – జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న పాన్-ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది ప్రస్తుతం టాలీవుడ్ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఫుల్ హైప్ క్రియేట్ చేస్తోంది.
Brahmanandam | రామ్ చరణ్ – జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న పాన్-ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది ప్రస్తుతం టాలీవుడ్ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఫుల్ హైప్ క్రియేట్ చేస్తోంది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ భారీ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’ ఇప్పటికే సోషల్ మీడియాలో సునామిలా దూసుకెళ్తోంది.
24 గంటల్లోనే రికార్డులు – రెహమాన్ మేజిక్‌కి ఫిదా
నవంబర్ 7న విడుదలైన ఈ సాంగ్, కేవలం 24 గంటల్లోనే రికార్డ్ స్థాయిలో వ్యూస్ సాధించి ట్రెండింగ్‌లో నిలిచింది. మోహిత్ చౌహాన్ వాయిస్, రెహమాన్ స్వరాలు, రామ్ చరణ్ ఎనర్జీ, జాన్వీ కపూర్ అందం అన్ని కూడా అభిమానులకి మంచి ఊపునిచ్చాయి. గ్రామీణ వాతావరణంలో “లవ్ ఎట్ ఫస్ట్ సైట్” మోమెంట్‌ను అద్భుతంగా ప్రెజెంట్ చేసిన తీరు అందర్నీ ఆకట్టుకుంది.
లిరిక్స్ అర్థం కాకపోయినా క్రేజ్ మాత్రం పీక్స్‌లో
చికిరి చికిరి సాంగ్ యూట్యూబ్‌లో విడుదలైన 16 రోజుల్లోనే అన్ని భాషల కలిపి 100 మిలియన్ వ్యూస్ దాటింది. మోహిత్ చౌహాన్ తెలుగు పలుకులు, స్పష్టతపై వచ్చిన విమర్శలు కూడా సాంగ్ క్రేజ్‌ని ఏమాత్రం తగ్గించలేకపోయాయి. “బీట్, ఫ్లో, విజువల్స్ సెట్ అయితే చాలు, లిరిక్స్ అర్థం అవసరం లేదు” అనేలా పాట వైరల్ అవుతూ ప్రేక్షకుల నోటా మారుమోగిపోతుంది.
చైనా, జపాన్, నైజీరియాలో కూడా ‘చికిరి’ జోరు
ఈ పాటకు వచ్చిన స్పందన కేవలం ఇండియా వరకే పరిమితం కాలేదు. జపాన్ నుంచి చైనా వరకు, నైజీరియా నుంచి ఫిలిప్పీన్స్ వరకు—అన్ని దేశాల్లోనూ రీల్స్, వీడియోలు, షార్ట్స్ అదరగొడుతున్నాయి. అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ పోటాపోటీగా రామ్ చరణ్ హుక్ స్టెప్ వేస్తున్నారు. ఇక ఈ సాంగ్‌లో జాన్వీ కంటే కూడా రామ్ చరణ్ ఎనర్జీ, హుక్ స్టెప్స్‌కే ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
బ్రహ్మానందం మీమ్ స్టార్మ్ – ‘చికిరి’కి కొత్త కలర్
సోషల్ మీడియాలో బ్రహ్మానందం మీమ్స్, ఎడిట్స్ అంటే ప్రత్యేక క్రేజ్. ఇప్పుడు అదే క్రేజ్ చికిరి చికిరిపైన కూడా కనిపిస్తోంది. బ్రహ్మానందం పాత సినిమాల నుంచి తీసిన డాన్స్ స్టెప్స్, ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్‌ను పాట బీట్‌కి జతచేసి నెటిజన్లు అద్భుతమైన ఎడిట్స్ చేస్తున్నారు. “చరణ్ vs బ్రహ్మీ – ఎవరు బెస్ట్?” అంటూ పోల్స్ కూడా పెట్టారు. కొందరైతే ఇంకా బోల్డ్‌గా “ఒరిజినల్ కన్నా ఇది బెస్ట్!” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
పెద్ది కోసం ఫ్యాన్స్ కౌంట్‌డౌన్
పెద్ది మూవీని 2026 సమ్మర్ కానుకగా, మార్చి చివరి వారంలో విడుదల చేయడానికి టీమ్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే సాంగ్‌తో హైప్ పీక్స్‌లో ఉండటంతో, సినిమా నుంచి వచ్చే ఇతర అప్‌డేట్స్ కోసం అభిమానులు భారీగా ఎదురుచూస్తున్నారు.
View this post on Instagram
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram