Dhurandhar 2 | భారీ ఓపెనింగ్స్‌తో దూసుకెళుతున్న‌ ‘దురంధర్ ది రివెంజ్’ .. ప్రీమియర్స్‌తోనే రికార్డు కలెక్షన్స్

Dhurandhar 2 | సూపర్ హిట్ మూవీ దురంధర్ కు సీక్వెల్‌గా రూపొందిన దురంధర్ ది రివెంజ్ మార్చి 19న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. మొదటి పార్ట్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1300 కోట్లకు పైగా వసూలు చేయడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అదే హైప్‌తో పార్ట్ 2 కి ప్రమోషన్స్ లేకుండానే భారీ అడ్వాన్స్ బుకింగ్స్ రావడం విశేషం.

Dhurandhar 2 | సూపర్ హిట్ మూవీ దురంధర్ కు సీక్వెల్‌గా రూపొందిన దురంధర్ ది రివెంజ్ మార్చి 19న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. మొదటి పార్ట్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1300 కోట్లకు పైగా వసూలు చేయడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అదే హైప్‌తో పార్ట్ 2 కి ప్రమోషన్స్ లేకుండానే భారీ అడ్వాన్స్ బుకింగ్స్ రావడం విశేషం. ప్రీమియర్ షోల నుంచే సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు థియేటర్లకు భారీగా చేరుకుంటున్నారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే ట్విస్టులు, యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను షాక్‌కు గురి చేస్తున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

మొదట ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్‌లో తెలుగు, తమిళ్ భాషల్లో కూడా రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ ప్లాన్ చేసినప్పటికీ, చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలు రావడంతో కేవలం హిందీలోనే విడుదల చేశారు. అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో హిందీ వెర్షన్‌కే భారీగా బుకింగ్స్ నమోదయ్యాయి. బాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ప్రీమియర్స్‌తో పాటు ఫస్ట్ డే కలిపి దాదాపు 172 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. కేవలం ప్రీమియర్ షోల నుంచే 43 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేయగా, మొదటి రోజు దాదాపు 130 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా దాదాపు 33 వేల షోలకు పైగా ఈ సినిమా ప్రదర్శించబడింది.

హిందీలోనే మొదటి రోజే 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రెండు వేల షోలు పడగా, హిందీ వెర్షన్ ద్వారానే దాదాపు 3 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. ఒకవేళ తెలుగు, తమిళ్ భాషల్లో కూడా ఒకేసారి విడుదలై ఉంటే ఈ కలెక్షన్స్ మరింత పెరిగేవని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే మూవీ యూనిట్ ఇంకా అధికారిక కలెక్షన్స్ ప్రకటించలేదు.

ఇండియాలో ఫస్ట్ డే హైయెస్ట్ ఓపెనింగ్స్ కలెక్ట్ చేసిన సినిమాల్లో ప్రస్తుతం పుష్ప 2 294 కోట్లతో టాప్‌లో ఉంది. ఆ తర్వాత RRR, బాహుబలి, కల్కి 2898 AD వంటి సినిమాలు టాప్ లిస్ట్‌లో ఉన్నాయి. ఈ వేగాన్ని చూస్తే ‘దురంధర్ ది రివెంజ్’ కూడా త్వరలోనే పెద్ద రికార్డులను టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Latest News