Faima | వైవాహిక బంధంలోకి జబర్దస్త్ ప్రవీణ్.. వీడియో కాల్‌లో విషెస్ చెప్పిన ఫైమా
Faima | జబర్దస్త్ వేదికపై తన కామెడీ టైమింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ ప్రవీణ్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. చాలా కాలంగా ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న నటి, డ్యాన్సర్ కడెం వంశితను ఆయన కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నాడు.
Faima | జబర్దస్త్ వేదికపై తన కామెడీ టైమింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ ప్రవీణ్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. చాలా కాలంగా ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న నటి, డ్యాన్సర్ కడెం వంశితను ఆయన కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. ఇరు కుటుంబాల పెద్దలు, బంధువులు, సన్నిహితులతో పాటు పలువురు బుల్లితెర ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఎంతో ఆనందంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జబర్దస్త్ కళాకారులతో పాటు టెలివిజన్ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ప్రవీణ్-వంశిత దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఫైమా విషెస్..
అయితే ఈ పెళ్లిలో అందరి దృష్టిని ఆకర్షించిన అంశం ఫైమా వీడియో కాల్. జబర్దస్త్‌లో ప్రవీణ్‌తో కలిసి ఎన్నో హిట్ స్కిట్స్ చేసిన ఫైమా వ్యక్తిగత కారణాల వల్ల పెళ్లికి హాజరుకాలేకపోయింది. దీంతో వీడియో కాల్ ద్వారా ప్రవీణ్, వంశితలకు విషెస్ తెలిపింది. “హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా ప్రవీణ్” అంటూ ఫైమా చెప్పిన వీడియోను ఆమె స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు కూడా కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రవీణ్, ఫైమా జోడికి జబర్దస్త్ వేదికపై ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. వీరిద్దరూ కలిసి చేసిన కామెడీ స్కిట్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేవి. దీంతో రీల్ లైఫ్‌లో మాత్రమే కాదు.. రియల్ లైఫ్‌లో కూడా ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకుంటారనే రూమర్లు అప్పట్లో బాగా వినిపించాయి.
అయితే కాలక్రమంలో ఇద్దరూ దూరమైనట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై ఎప్పుడూ స్పందించకపోయినా, ఇప్పుడు ప్రవీణ్ పెళ్లికి ఫైమా వీడియో కాల్ ద్వారా విషెస్ చెప్పడం మరోసారి సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఇక వంశిత విషయానికి వస్తే.. నటిగా, డ్యాన్సర్‌గా ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో కూడా ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వివిధ డాన్స్ ప్రదర్శనలు, టెలివిజన్ కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది.
పలు షోలతో బిజీ..
మరోవైపు ప్రవీణ్ ‘పటాస్’ కార్యక్రమంతో కెరీర్ ప్రారంభించి, తరువాత జబర్దస్త్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. తన కామెడీ పంచ్‌లు, టైమింగ్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. జబర్దస్త్‌తో పాటు ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ వంటి కార్యక్రమాల్లో కూడా అలరిస్తున్నాడు.
టెలివిజన్ కార్యక్రమాలతో పాటు యూట్యూబ్‌లో కూడా సొంత ఛానల్ నిర్వహిస్తున్న ప్రవీణ్, అప్పుడప్పుడు సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇప్పుడు పెళ్లితో జీవితంలో కొత్త ప్రయాణం మొదలుపెట్టిన ఈ జంటకు అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
View this post on Instagram
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram