Chiranjeevi| సోష‌ల్ మీడియాలో రంజాన్ శుభాకాంక్ష‌లు.. వైర‌ల్ అవుతున్న ట్వీట్

Chiranjeevi| సోష‌ల్ మీడియాలో రంజాన్ శుభాకాంక్ష‌లు.. వైర‌ల్ అవుతున్న ట్వీట్

Chiranjeevi| ముస్లిం సోద‌రులు అత్యంత ప్రీతిపాత్రంగా జ‌రుపుకునే పండ‌గ రంజాన్. రంజాన్ మాసంలోని చివరి రోజు ఎంతో ఘనంగా ఈద్-ఉల్-ఫితర్ పండుగను జరుపుకుంటారు. ఈ పండగనే మనమంతా రంజాన్ అని పిలుచుకుంటూ ఉంటాం. అయితే పండ‌గ రోజు నెల మొత్తం చేసిన కఠినమైన ఉపవాస దీక్షలు ముగుస్తాయి. ఇంతటి పవిత్రమైన పండగ రోజున ముస్లిం సోదరులంతా కొత్త దుస్తులు ధరించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వ‌హించ‌డం, అలానే శుభాకాంక్ష‌లు తెలియ‌జేసుకుంటూ వ‌స్తుంటారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే రంజాన్ పండుగ వేడుకలు ప్ర‌తి చోటా అట్ట‌హాసంగా జ‌రుగుతున్నాయి.

పండుగ నేపథ్యంలో ఎలాంటి ఆటంకాలు జరుగకుండా హైద‌రాబాద్ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. ఇక రంజాన్ పండ‌గ సంద‌ర్భంగా ప‌లువురు సినీ ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి త‌న సోష‌ల్ మీడియా ద్వారా ముస్లిం సోద‌రుల‌కి ప్ర‌త్యేకంగా విషెస్ తెలిపారు. ఈద్ ముబారక్ శుభాకాంక్ష‌లు! అందరికీ ఆనందం, శాంతి మరియు సంతోషం కల‌గాలి. ముస్లిం సోద‌రుల‌కి రంజాన్ శుభాకాంక్షలు! అంటూ చిరు ఎక్స్ వేదిక‌గా రాసుకోచ్చాడు. ఇక చిరంజీవి సినిమా విష‌యాల‌కి వ‌స్తే ప్ర‌స్తుతం విశ్వంభ‌ర అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా గ‌త కొద్ది రోజులుగా వశిష్ట ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతుంది. ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి.

ఇక చిరంజీవి ఖైదీ నెంబర్ 150 పేరుతో వినాయక్ డైరెక్షన్ లో రీఎంట్రీ ఇచ్చాడు. రీఎంట్రీలో తొలి సినిమాతోనే బాస్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు. ఇక చిరంజీవికి సెకండ్ ఇన్నింగ్స్ కలిసి రాకపోగా…భారీ డిజాస్టర్ ను మిగిల్చిన సినిమా ఆచార్య అని చెప్పాలి. రీఎంట్రీలో సైరా న‌ర‌సింహారెడ్డి, భోళా శంక‌ర్, గాడ్ ఫాద‌ర్ వంటి చిత్రాలు కూడా ఆయ‌న‌కు మంచి విజ‌యాలు అందించ‌లేక‌పోయాయి.