Heroine Raasi | 21 ఏళ్ల మ్యారేజ్ సీక్రెట్ బయటపెట్టిన రాశి .. అంద‌రి ముందు ఒరేయ్ అని పిలుస్తానంటూ కామెంట్

Heroine Raasi | చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన రాశి, ఇప్పుడు సినిమాలు,సీరియల్స్‌లో అవకాశాలు అందుకుంటూ మళ్లీ ఫుల్ ఫామ్‌లో కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జగపతిబాబు, శ్రీకాంత్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన రాశి, దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించారు. ఇటీవలి కాలంలో బుల్లితెరపై ‘జానకి కలగనలేదు’ సీరియల్‌తో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు.

Heroine Raasi | చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన రాశి, ఇప్పుడు సినిమాలు,సీరియల్స్‌లో అవకాశాలు అందుకుంటూ మళ్లీ ఫుల్ ఫామ్‌లో కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జగపతిబాబు, శ్రీకాంత్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన రాశి, దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించారు. ఇటీవలి కాలంలో బుల్లితెరపై ‘జానకి కలగనలేదు’ సీరియల్‌తో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు.

ఇటీవల వరుస ఇంటర్వ్యూలతో వార్తల్లో నిలుస్తున్న రాశి, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తన వివాహం గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

నేనే వెళ్లి ప్రపోజ్ చేశా ..

రాశి మాట్లాడుతూ.. తాను కేవలం 22 ఏళ్ల వయసులోనే అసోసియేట్ డైరెక్టర్ అయిన ఎస్.ఎస్. నివాస్ (శ్రీనివాస్)ను పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. ఆ టైమ్‌లో నేను చాలా బిజీగా ఉండేదాన్ని. రోజుకు నాలుగు–ఐదు సినిమాలు చేస్తూ కెరీర్ పీక్స్‌లో ఉన్నాను. అదే సమయంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా. అప్పుడే మా ఆయన నా జీవితంలోకి వచ్చారు. అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన దగ్గరకు నేనే వెళ్లి ప్రపోజ్ చేశా అని రాశి చెప్పుకొచ్చారు.

అసోసియేట్‌లు హీరోయిన్ దగ్గరకు వచ్చి పెళ్లి విషయాలు మాట్లాడరు కాబట్టి నేనే అడిగాను. ముందుగా మేమిద్దరం నిర్ణయం తీసుకుని, తర్వాత ఇంట్లో చెప్పాం అని తెలిపారు.

షాక్ అయిన రెండు కుటుంబాలు..

ఈ పెళ్లి విషయంలో రెండు కుటుంబాల్లోనూ మొదట ఆశ్చర్యం వ్యక్తమైందని రాశి చెప్పారు. ఇంత పెద్ద హీరోయిన్‌వి కదా.. ఆయన అసోసియేట్ డైరెక్టర్ కదా అని చాలామంది మాట్లాడారు. కానీ నేను అలాంటి లెక్కలు వేయలేదు. ఆయనపై నమ్మకం కలిగింది.. అందుకే పెళ్లి చేసుకున్నాను అని అన్నారు.

ప్రముఖ దర్శకుల మద్దతు

తన నిర్ణయానికి అప్పట్లో దర్శకులు కోడి రామకృష్ణ, ముత్యాల సుబ్బయ్య కూడా మద్దతుగా నిలిచారని తెలిపారు. అసోసియేట్ డైరెక్టర్‌ను పెళ్లి చేసుకోవడంలో తప్పేముంది? రేపు అతనే పెద్ద డైరెక్టర్ అవుతాడు అని వారు ప్రోత్సహించారని రాశి గుర్తు చేసుకున్నారు.

21 ఏళ్ల సంతోషకరమైన వివాహ జీవితం

పెళ్లై 21 ఏళ్లు అయినప్పటికీ తమ దాంపత్య జీవితం చాలా సంతోషంగా సాగుతోందని రాశి చెప్పారు.
ఇంట్లో మేము పూర్తిగా నార్మల్ ఫ్యామిలీలా ఉంటాం. ఆయన పని ఆయనది.. నా పని నాది. బయట ఆయన డైరెక్టర్.. నేను హీరోయిన్. కానీ ఇంట్లో మాత్రం నేను ‘విజ్జీ’, ఆయన ‘నివాస్’ మాత్రమే” అని చెప్పారు.

సెట్స్‌లో జరిగిన ఆసక్తికర ఘటన

తన భర్త దర్శకత్వంలో వచ్చిన ‘లంక’ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను కూడా రాశి పంచుకున్నారు. ఒకసారి షూటింగ్ జరుగుతున్న సమయంలో తన కూతురు పడిపోయిందని ఇంటి నుంచి ఫోన్ రావడంతో, వెంటనే భర్తను పిలిచానని తెలిపారు.అప్పుడు ‘రేయ్ శీను’ అని పిలిచా. తర్వాత యూనిట్ వాళ్లు ‘ఆయన మాకు గురువు.. ఇలా పిలవకండి’ అన్నారు. కానీ నాకు ఆయన భర్త. నేను నటించడం కెమెరా ముందు మాత్రమే.. నిజజీవితంలో కాదు అని రాశి స్పష్టం చేశారు.

Latest News