JD Chakravarthy | జేడీ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు.. పెళ్లైన కూడా అలాంటి పనులు చేయడమేంటో..
JD Chakravarthy | ఒకప్పటి హీరో, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న జేడీ చక్రవర్తి తాజాగా చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ప్రస్తుతం గాయపడ్డ సింహం సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్న ఆయన, ఓ పాడ్‌కాస్ట్‌లో చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
JD Chakravarthy | ఒకప్పటి హీరో, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న జేడీ చక్రవర్తి తాజాగా చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ప్రస్తుతం గాయపడ్డ సింహం సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్న ఆయన, ఓ పాడ్‌కాస్ట్‌లో చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ జేడీ చక్రవర్తి ఇండియా మొత్తం గౌరవించే ఓ సీనియర్ నటుడి గురించి సంచలన విషయాలు వెల్లడించారు. అయితే ఆ నటుడి పేరు మాత్రం చెప్పకుండా ఆసక్తిని పెంచారు. “ఎవరినైనా నిజాలు తెలియకుండా గౌరవించకూడదు. నేను చాలా రెస్పెక్ట్ చూపించే ఓ యాక్టర్ ఉన్నాడు. ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా గౌరవం ఉంది. నిజ జీవితంలో కూడా అలానే ఉంటారని అనుకున్నాను” అని ఆయన అన్నారు.
నా అంచనాలు తప్పాయి..
కానీ ఆయన విషయంలో నా అంచనాలు తప్పాయని జేడీ పేర్కొన్నారు. “ఆయన షూటింగ్‌కు ఆలస్యంగా వస్తారని తెలిసింది. కారణం అడిగితే తాగింది దిగలేదని చెప్పారు. ఇంకా ఆయన హోటల్‌లో కాకుండా తన గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో ఉంటారని తెలిసి షాక్ అయ్యాను. పెళ్లయినా కూడా అలా ఉండటం నాకు ఆశ్చర్యం కలిగించింది” అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. జేడీ ఇచ్చిన హింట్స్ ఆధారంగా ఆ నటుడు ఎవరై ఉంటారో నెటిజన్లు అంచనాలు వేస్తున్నారు. అయితే పేరు వెల్లడించకపోవడంతో ఊహాగానాలు మరింత పెరిగాయి.
గాయపడ్డ సింహం ప్రమోషన్స్..
ఇదిలా ఉండగా, జేడీ చక్రవర్తి నటిస్తున్న గాయపడ్డ సింహం సినిమా మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్ హీరోగా నటించగా, మానస చౌదరి, ఫరియా అబ్దుల్లా హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి కశ్యప్ దర్శకత్వం వహించారు.
ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా, అమెరికాకు వెళ్లాలనుకునే ఓ యువకుడికి ఎదురయ్యే పరిస్థితులను హాస్యరసంతో చూపించనుందని సమాచారం. ఇందులో జేడీ చక్రవర్తి కీలక పాత్రలో కనిపించనుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.
మొత్తానికి, జేడీ చక్రవర్తి చేసిన సంచలన వ్యాఖ్యలు ‘గాయపడ్డ సింహం’ సినిమాకు విడుదలకు ముందే భారీ పబ్లిసిటీ తెచ్చిపెట్టాయి. ఇప్పుడు అందరి దృష్టి ఆ సీనియర్ నటుడు ఎవరన్న దానిపైనే నిలిచింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram