JD Chakravarthy | రైస్‌కు గుడ్‌బై.. కఠినమైన ఫిట్‌నెస్ రూల్స్‌తో యంగ్‌గా క‌నిపిస్తున్న‌ జేడీ చక్రవర్తి

JD Chakravarthy | తెలుగు సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన జేడీ చక్రవర్తి ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్‌తో మళ్లీ వార్తల్లో నిలుస్తున్నారు. ఒకప్పుడు హీరోగా సక్సెస్ అందుకున్న ఆయన, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా తనదైన ముద్ర వేశారు. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న జేడీ, తిరిగి బలమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

JD Chakravarthy | తెలుగు సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన జేడీ చక్రవర్తి ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్‌తో మళ్లీ వార్తల్లో నిలుస్తున్నారు. ఒకప్పుడు హీరోగా సక్సెస్ అందుకున్న ఆయన, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా తనదైన ముద్ర వేశారు. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న జేడీ, తిరిగి బలమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన కెరీర్, వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా ఆరోగ్య రహస్యాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన కెరీర్‌లో వచ్చిన విరామం గురించి మాట్లాడుతూ, అది అనివార్యం కాదని, తానే కావాలనే తీసుకున్న నిర్ణయం అని తెలిపారు. మంచి కథ, మంచి పాత్ర కోసం చాలా కాలం పాటు వేచి చూశానని చెప్పారు. దయా వెబ్ సిరీస్ తనకు మళ్లీ నమ్మకం కలిగించిందని, దాన్ని విన్న వెంటనే ఇది ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అవుతుందని అర్థమైందని పేర్కొన్నారు. ఆ సిరీస్ విజయంతోనే తదుపరి ప్రాజెక్టులను ఎంపిక చేసుకున్నానని తెలిపారు.

యువ‌కుడిగా క‌నిపించ‌డానికి కార‌ణం ఇదే..

ఇక తన ఫిట్‌నెస్ గురించి చెప్పిన విషయాలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. 56 ఏళ్ల వయసులో కూడా యువకుడిలా కనిపించడానికి ప్రధాన కారణం తన ఆహార నియమాలేనని ఆయన వెల్లడించారు. గత 24-25 సంవత్సరాలుగా అన్నం పూర్తిగా మానేశానని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా ఒక రోజు అన్నం తినకపోతేనే అలసటగా అనిపించే పరిస్థితుల్లో, ఇన్ని సంవత్సరాలుగా రైస్ తినకపోవడం తనకు అలవాటైపోయిందని చెప్పారు.

ఆహారం విషయంలో రుచి కంటే ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇస్తానని జేడీ తెలిపారు. పండ్లు, ఫ్రూట్ జ్యూస్‌ల పట్ల కూడా పెద్దగా ఆసక్తి లేదని, వాటిలో చక్కెర శాతం ఎక్కువగా ఉండటం వల్ల పరిమితంగానే తీసుకుంటానని చెప్పారు. శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు సమతుల్యంగా అందేలా చూసుకుంటానని, కానీ రుచికోసం ఏది పడితే అది తిననని స్పష్టం చేశారు.

వ్యాయామం విష‌యంలో రాజీ ప‌డ‌ను..

ఇక వ్యాయామం విషయంలో కూడా ఆయన ఎలాంటి రాజీ పడరు. ప్రతిరోజూ కనీసం ఒక గంట పాటు కఠినమైన వర్కవుట్స్ చేస్తానని చెప్పారు. షూటింగ్‌ల కోసం అవుట్‌డోర్‌లో ఉన్నా, విదేశాల్లో ఉన్నా కూడా వ్యాయామాన్ని ఎప్పుడూ మిస్ అవ్వనని వెల్లడించారు. క్రమశిక్షణతో కూడిన జీవనశైలే తన ఫిట్‌నెస్‌కు కారణమని చెప్పారు.

అంతేకాకుండా, ఆరోగ్యం అంటే కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాదని, మానసిక ప్రశాంతత కూడా చాలా ముఖ్యమని జేడీ పేర్కొన్నారు. వ్యక్తిగత జీవితంలో సంతోషంగా ఉంటేనే వృత్తిపరంగా రాణించగలమని అన్నారు. ఒత్తిడికి లోనుకాకుండా, తనకు నచ్చిన పనిని ఇష్టంగా చేయడం వల్లే తాను ఇంకా యంగ్‌గా కనిపిస్తున్నానని వెల్లడించారు.

Latest News