JD Chakravarthy | 24 ఏళ్లుగా అన్నం ముట్ట‌ని స్టార్ హీరో .. ఫిట్‌నెస్ సీక్రెట్స్ చెప్పిన నటుడు

JD Chakravarthy | ఒకప్పుడు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న జేడీ చక్రవర్తి ఇప్పుడు విలన్‌గా కొత్త ఇమేజ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తరుణ్ భాస్కర్ హీరోగా తెరకెక్కుతున్న ‘గాయపడ్డ సింహం’ సినిమాలో జేడీ కీలక పాత్ర పోషించగా, ఈ చిత్రం మే 1న విడుదలకు సిద్ధమైంది.

  • By: Sandeep |    movies |    Published on : Apr 27, 2026 3:40 PM IST
JD Chakravarthy | 24 ఏళ్లుగా అన్నం ముట్ట‌ని స్టార్ హీరో .. ఫిట్‌నెస్ సీక్రెట్స్ చెప్పిన నటుడు

JD Chakravarthy | ఒకప్పుడు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న జేడీ చక్రవర్తి ఇప్పుడు విలన్‌గా కొత్త ఇమేజ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తరుణ్ భాస్కర్ హీరోగా తెరకెక్కుతున్న ‘గాయపడ్డ సింహం’ సినిమాలో జేడీ కీలక పాత్ర పోషించగా, ఈ చిత్రం మే 1న విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న జేడీ చక్రవర్తి, తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా ఫుడ్ హ్యాబిట్స్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

56 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా కనిపిస్తున్న జేడీ తన ఫిట్‌నెస్ రహస్యాన్ని వెల్లడిస్తూ, “నేను రోజుకు తప్పకుండా గంటసేపు జిమ్ చేస్తాను. ‘హెల్త్ ఈజ్ వెల్త్’ అని నమ్ముతాను” అని తెలిపారు. అయితే అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే.. ఆయన గత 24 ఏళ్లుగా అన్నం తినడం పూర్తిగా మానేశారట.

అన్నం తిన‌ను..

“అన్నం తింటే లావు అవుతాననే కారణం కాదు. కానీ తినడం మానేశాను. కార్బోహైడ్రేట్స్ అన్నం ద్వారానే కాకుండా ఇతర ఆహారాల్లో కూడా లభిస్తాయి. ఫ్రూట్ జ్యూసులు కూడా ఎక్కువగా తీసుకుంటాను” అని చెప్పారు. ఫుడ్ విషయంలో ప్రత్యేకమైన నియమాలు లేవని, ఏది లభిస్తే అది తింటానని, కానీ పరిమితిలోనే తీసుకుంటానని వెల్లడించారు.

అయితే తనకు ఫుడ్ అంటే పెద్దగా ఇష్టం ఉండదని, తినాల్సి వస్తేనే తింటానని జేడీ స్పష్టం చేశారు. “ఫుడ్ అనేది నాకు బోరింగ్ టాపిక్. మా అమ్మకు కూడా ఫుడ్ అంటే ఇష్టం ఉండదు. ఆమెకు వంట కూడా బాగా రాదు. చిన్నప్పటి నుంచి ప్రత్యేకంగా వంటలు చేసి పెట్టలేదు. అందుకే నాకు ఆహారం మీద ఆసక్తి తక్కువ” అని చెప్పారు.

వెజిటేరియ‌న్ మాత్ర‌మే తీసుకుంటాను..

ఇక తన ఆహారపు అలవాట్లపై మాట్లాడుతూ, తాను వీగన్ అని, కేవలం వెజిటేరియన్ ఆహారమే తీసుకుంటానని, అది కూడా కేవలం కడుపు నింపుకోవడానికి మాత్రమే అని తెలిపారు. ఫిట్‌గా ఉండేందుకు నియంత్రణ చాలా ముఖ్యమని ఆయన అభిప్రాయం.

అన్నం తినకుండా ఇన్నేళ్లుగా తన ఫిట్‌నెస్‌ను మెయింటైన్ చేస్తూ వస్తున్న జేడీ చక్రవర్తిపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ‘గాయపడ్డ సింహం’ సినిమా ద్వారా విలన్‌గా ఆయన ఎలా మెప్పిస్తారో అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.