Mahesh | ఇండస్ట్రీలో కుల వివక్ష చాలా ఉంది.. అందుకే అవ‌కాశాలు కోల్పోయానంటూ మహేష్ విట్టా షాకింగ్ కామెంట్స్

Mahesh | యూట్యూబ్ ద్వారా కెరీర్ ప్రారంభించి, వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు మ‌హేష్ విట్లా తాజాగా చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఒక ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను వెల్లడిస్తూ, ముఖ్యంగా ఇండస్ట్రీలో కుల వివక్ష ఇంకా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Mahesh | యూట్యూబ్ ద్వారా కెరీర్ ప్రారంభించి, వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు మ‌హేష్ విట్లా తాజాగా చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఒక ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను వెల్లడిస్తూ, ముఖ్యంగా ఇండస్ట్రీలో కుల వివక్ష ఇంకా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మహేష్ విట్టా మొదటగా నటుడిగా కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించాలని ఆశపడ్డారు. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు Tejaను కలిసి అవకాశాలు కోరారు. అయితే మహేష్‌లోని టాలెంట్‌ను గుర్తించిన తేజ, డైరెక్షన్ కంటే నటనపై దృష్టి పెట్టాలని సూచించడంతో ఆయన తన దారిని మార్చుకున్నారు. ఆ నిర్ణయమే ఆయన కెరీర్‌కు కీలక మలుపు అయింది.

తీవ్ర నిరాశ‌కు గుర‌య్యాను..

అయితే ఇండస్ట్రీలో తన ఎదుగుదల అంత సులభం కాదని మహేష్ వెల్లడించారు. చాలా సందర్భాల్లో పాత్రలకు ఆడిషన్స్ ఇచ్చి ఎంపికైనప్పటికీ, చివరి నిమిషంలో తనను తప్పించి మరొకరిని తీసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. ఆ తరువాత కారణాలు తెలుసుకుంటే, తన స్థానంలో వచ్చిన వారు నిర్మాతలు లేదా దర్శకుల సామాజిక వర్గానికి చెందినవారేనని తెలిసి తీవ్ర నిరాశకు గురయ్యానని వెల్లడించారు.

“ప్రతిభ ఉన్నప్పటికీ, కేవలం తమ కులానికి చెందినవాడిని కాదనే కారణంతో అవకాశాలు కోల్పోవడం చాలా బాధ కలిగించింది” అంటూ మహేష్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులు తనను మానసికంగా కూడా దెబ్బతీశాయని చెప్పారు.

ఆర్థికంగా కూడా మోస‌పాయాను..

కేవలం కుల వివక్ష మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా మోసపోయానని మహేష్ పేర్కొన్నారు. కొన్ని సినిమాలు గుర్తింపు కోసం పారితోషకం లేకుండా చేశానని, మరికొన్ని సినిమాలకు పని చేసినప్పటికీ ఇప్పటికీ డబ్బులు ఇవ్వలేదని వెల్లడించారు. రెమ్యూనరేషన్ గురించి అడిగితే తప్పించుకునే పరిస్థితులు ఎదురయ్యాయని అన్నారు.

సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ, ఇండస్ట్రీలో కొందరు తనను చిన్నచూపు చూసేవారని, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పారు. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు.

మ‌హేష్‌కి మ‌ద్ధ‌తు..

ప్రస్తుతం వెబ్ సిరీస్‌లు, సినిమాలతో బిజీగా ఉన్న మహేష్ విట్టా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రతిభను పక్కనపెట్టి కులాన్ని ఆధారంగా చేసుకుని అవకాశాలు ఇవ్వడం తప్పు అని పలువురు నెటిజన్లు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.

మొత్తానికి మహేష్ విట్టా చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లోని మరో చీకటి కోణాన్ని బయటపెట్టినట్లయ్యాయి. ఇండస్ట్రీలో సమాన అవకాశాలు అందరికీ రావాలన్న చర్చకు ఇవి మళ్లీ బలం చేకూర్చాయి.

Latest News