Malla Reddy | ఆహా ‘సర్కార్’ షోలో ఎమ్మెల్యే మల్లారెడ్డి సందడి… స్టెప్పులు, పంచులతో ప్రోమో వైరల్
Malla Reddy | రాజకీయ నేత, ఎమ్మెల్యే మల్లా రెడ్డి ప్రత్యేక శైలిలో మాట్లాడడం, ప్రసంగాలతో పాటు విద్యాసంస్థల ద్వారా మంచి గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. అప్పుడప్పుడు సినిమా కార్యక్రమాల్లో కనిపిస్తూ సందడి చేసే మల్లారెడ్డి తాజాగా ఆహా వేదికపై ప్రసారమవుతున్న ‘సర్కార్’ షోలో గెస్ట్‌గా హాజరయ్యారు.

ఈ షోను సుడిగాలి సుధీర్, విష్ణు ప్రియ హోస్ట్ చేస్తున్నారు. సుధీర్ తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తుండగా, ఈ ఎపిసోడ్‌లో మల్లారెడ్డితో పాటు అలీ , శివాజీ కూడా పాల్గొన్నారు.
మల్లా రెడ్డి పంచులు..
తాజాగా విడుదలైన ప్రోమోలో మల్లా రెడ్డి తనదైన స్టైల్‌లో స్టెప్పులు వేస్తూ, సరదా పంచులతో అందరినీ ఆకట్టుకున్నారు. సుధీర్‌పై వరుసగా చమత్కార వ్యాఖ్యలు చేస్తూ నవ్వులు పూయించారు. తనకు ప్రసిద్ధి తెచ్చిన కొన్ని డైలాగ్స్‌ను కూడా చెప్పి ప్రేక్షకులను అలరించారు.
ఈ ప్రోమో విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మల్లారెడ్డి ఎనర్జీ, సరదా వ్యాఖ్యలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. పూర్తి ఎపిసోడ్‌లో ఆయన ఇంకా ఏమేమి మాట్లాడారు? ఎంతగా ఎంటర్టైన్ చేశారు? అన్నది తెలుసుకోవాలంటే ప్రసారం కోసం ఎదురుచూడాల్సిందే.
మొత్తంగా చూస్తే, ఆహా ‘సర్కార్’ షోలో ఈ ఎపిసోడ్ మంచి వినోదాన్ని అందించనుందని ప్రోమోతోనే స్పష్టమవుతోంది. కాగా, గతంలో కూడా మల్లా రెడ్డి పలు టీవీ షోలలో పాల్గొని సందడి చేయడం మనం చూశాం. తాజాగా విడుదలైన ప్రోమోని చూస్తుంటే ఈ ఎపిసోడ్ కి మంచి మార్కులు పడడం ఖాయంగా కనిపిస్తుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram