Namrata | ఒకే ఫ్రేమ్‌లో నా ప్రపంచం .. న‌మ్ర‌త షేర్ చేసిన పోస్ట్‌లో గౌతమ్, సితారల అల్ల‌రి

Namrata | సూపర్ స్టార్ మ‌హేష్ బాబు కుటుంబం గురించి అభిమానులకు ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా మహేశ్ బాబు సతీమణి, మాజీ నటి న‌మ్ర‌త శిరోద్క‌ర్ సోషల్ మీడియాలో పంచుకునే కుటుంబానికి సంబంధించిన పోస్టులు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంటాయి.

Namrata | సూపర్ స్టార్ మ‌హేష్ బాబు కుటుంబం గురించి అభిమానులకు ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా మహేశ్ బాబు సతీమణి, మాజీ నటి న‌మ్ర‌త శిరోద్క‌ర్ సోషల్ మీడియాలో పంచుకునే కుటుంబానికి సంబంధించిన పోస్టులు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంటాయి. తాజాగా నమ్రత మరోసారి తన పిల్లలతో ముడిపడిన ఓ మధుర జ్ఞాపకాన్ని అభిమానులతో పంచుకుని అందరి హృదయాలను గెలుచుకున్నారు.

నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కుమారుడు గౌత‌మ్ ఘ‌ట్ట‌మ‌నేని, కుమార్తె సితార ఘ‌ట్ట‌మ‌నేని చిన్ననాటి ఫొటోను షేర్ చేశారు. ఆ ఫొటోలో గౌతమ్, సితార ఇద్దరూ ఎంతో అమాయకంగా, చేతులు పైకెత్తి సరదాగా అల్లరి చేస్తూ కనిపించారు. చిన్నారుల అమాయకత్వం, వారి మధ్య ఉన్న స్నేహబంధం ఆ చిత్రంలో స్పష్టంగా కనిపించడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఒకే ఫ్రేమ్‌లో …

ఈ ఫొటోకు నమ్రత “One Frame, My Heart” (ఒకే ఫ్రేమ్‌లో నా హృదయం) అంటూ హార్ట్ ఎమోజీని జత చేశారు. అలాగే #Throwback, #TBT హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించి ఇది పాత జ్ఞాపకమని వెల్లడించారు. తల్లిగా తన పిల్లలపై ఉన్న అపారమైన ప్రేమను ఒక చిన్న క్యాప్షన్ ద్వారానే ఎంతో అందంగా వ్యక్తపరిచారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేసిన కొద్ది సేపటికే వైరల్‌గా మారింది. ఘట్టమనేని కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అనుబంధం, ప్రేమ, ఆప్యాయతలకు ఈ ఫొటో అద్దం పడుతోందని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. “ఎంత క్యూట్‌గా ఉన్నారు”, “సితార చిన్నప్పుడు కూడా ఎంతో చలాకీగా కనిపిస్తోంది”, “గౌతమ్‌లో అప్పుడే మహేశ్ బాబు పోలికలు కనిపిస్తున్నాయి” అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ప్ర‌తి పోస్ట్ వైర‌ల్..

కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చే నమ్రత తరచూ తన కుటుంబ సభ్యులకు సంబంధించిన ప్రత్యేక క్షణాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా గౌతమ్, సితార ఎదుగుదల, వారి విద్య, కుటుంబ విహారయాత్రలు, పండుగ వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటారు. అందుకే మహేశ్ బాబు కుటుంబానికి సంబంధించిన ప్రతి పోస్ట్ సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

కాగా, మహేశ్ బాబు – నమ్రత ప్రేమకథ కూడా తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత అందమైన ప్రేమకథల్లో ఒకటిగా చెప్పుకుంటారు. 2000లో విడుదలైన వంశీ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. కొన్నేళ్ల పాటు ఒకరినొకరు అర్థం చేసుకున్న ఈ జంట 2005లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అనంతరం 2006లో గౌతమ్ జన్మించగా, 2012లో సితార జన్మించింది. ప్రస్తుతం ఈ స్టార్ కిడ్‌లు కూడా సోషల్ మీడియాలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇదిలా ఉంటే, మహేశ్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజ‌మౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ చిత్ర పనులతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు నమ్రత మాత్రం కుటుంబ బాధ్యతలతో పాటు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో అనుబంధాన్ని కొనసాగిస్తూ తన కుటుంబంలోని అందమైన జ్ఞాపకాలను పంచుకుంటూ ఆకట్టుకుంటున్నారు.

Latest News