Smriti Mandhana | అందాల క్రికెటర్ పెళ్లికి టైం ఫిక్స్.. క్యూట్ జంటకి మోదీ ప్రత్యేక విషెస్
Smriti Mandhana | భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధన త్వరలోనే పెళ్లి బంధంలోకి అడుగు పెడుతున్నారు. ఆమె ఈ విషయాన్ని గురువారం ఇన్‌స్టాగ్రామ్ రీల్ ద్వారా కన్‌ఫాం చేసింది. రోడ్రిగ్స్ షేర్ చేసిన వీడియోలో ఆమె సహచర క్రికెటర్లు జెమీమా రోడ్రిగ్స్, రాధ యాదవ్, శ్రేయాంక పాటిల్, అరుంధతి రెడ్డి కలిసి పాల్గొన్నారు. ఈ వీడియోలో తన ఎంగేజ్‌మెంట్ రింగ్ చూపించి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు కన్‌ఫాం చేసింది.
Smriti Mandhana | భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధన త్వరలోనే పెళ్లి బంధంలోకి అడుగు పెడుతున్నారు. ఆమె ఈ విషయాన్ని గురువారం ఇన్‌స్టాగ్రామ్ రీల్ ద్వారా కన్‌ఫాం చేసింది. రోడ్రిగ్స్ షేర్ చేసిన వీడియోలో ఆమె సహచర క్రికెటర్లు జెమీమా రోడ్రిగ్స్, రాధ యాదవ్, శ్రేయాంక పాటిల్, అరుంధతి రెడ్డి కలిసి పాల్గొన్నారు. ఈ వీడియోలో తన ఎంగేజ్‌మెంట్ రింగ్ చూపించి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు కన్‌ఫాం చేసింది. సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్, స్మృతి మధ్య ప్రేమకథ ఇప్పటిదీ కాదు. ఎప్పటి నుండో వారిద్దరు ప్రేమలో మునిగి తేలుతున్నారు. అయితే ఈ ఇద్దరు నవంబర్ 23 తేదీన వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.
మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు..
ఈ సందర్భంగా, భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖని విడుదల చేశారు. ఈ వివాహ బంధంలో మీరు ఎల్లప్పుడూ ఒకరికి ఒకరు అండగా నిలవాలి, మీ జీవితంలో ప్రతీ మెట్టు సంతోషంగా సాగాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు టీమ్ మధ్య క్రికెట్ మ్యాచ్ సెలబ్రేషన్.. ఘనంగా జరగాలని కోరుకుంటున్నాను. నా ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి.. అని ఓ ప్రకటన ద్వారా తెలియజేసారు భారత ప్రధాని నరేంద్ర మోదీ.
ఇక ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా స్మృతి, పలాష్ ముచ్చల్ రిలేషన్‌షిప్‌కి సంబంధించి అనేక వార్తలు నెట్టింట హల్‌చల్ చేశాయి. గత నెలలో జరిగిన ఒక కార్యక్రమంలో పలాష్ ముచ్చల్ “త్వరలోనే స్మృతి మందన్నా ‘ఇండోర్ కోడలు’ అవుతుందన్న టోన్”లో కామెంట్ చేశారు. ఇప్పుడు దీనిపై అందరికి పూర్తి క్లారిటీ వచ్చినట్టు అయింది. నవంబర్ 23న జరగనున్న స్మృతి వివాహానికి పలువురు క్రికెటర్స్, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. ఇక ఇదిలా ఉంటే స్మృతి మందాన క్రికెట్ కెరీర్ అనుకున్నదానికన్నా సాఫీగా సాగుతుంది.
కెరీర్‌లో దూసుకుపోతున్న స్మృతి
ఆమె ఇటీవల జరిగిన ICC మహిళల వన్డే వరల్డ్ కప్-లో భారత జట్టుకు చారిత్రక విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించి, న్యూజిలాండ్‌పై మ్యాచ్-విన్నింగ్ సెంచరీ ద్వారా తన ప్రతిభను చాటింది. ఆ టోర్నీలో ఆమె తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 54.22 సగటుతో మొత్తం 434 పరుగులు సాధించింది. మొత్తానికి, స్మృతి మంధన–పలాష్ ముచ్చల్ జంట పెళ్లి ఫ్లాన్ ఖరారైన వెంటనే అభిమానుల నుండి శుభాకాంక్షలు వెల్లువ కురుస్తుంది. వారి కొత్త ప్రయాణం సంతోషకరం, ప్రేమతో నిండినదిగా ఉండాలి అన్నదే అందరి మనసులోని ఆకాంక్ష.
View this post on Instagram
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram