Pawan Kalyan | ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన పవన్ కళ్యాణ్ చెప్పులు… ధర ఎంతంటే?
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం చేసినా రెండు తెలుగు రాష్ట్రాల్లో వెంటనే చర్చనీయాంశం అవుతుందనడంలో సందేహం లేదు. ఆయన రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్నా, పార్టీ సమావేశంలో మాట్లాడినా, లేక సినిమా ఈవెంట్‌కు హాజరైనా అభిమానులు మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకుల దృష్టి కూడా ఆయనపైనే ఉంటుంది.
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం చేసినా రెండు తెలుగు రాష్ట్రాల్లో వెంటనే చర్చనీయాంశం అవుతుందనడంలో సందేహం లేదు. ఆయన రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్నా, పార్టీ సమావేశంలో మాట్లాడినా, లేక సినిమా ఈవెంట్‌కు హాజరైనా అభిమానులు మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకుల దృష్టి కూడా ఆయనపైనే ఉంటుంది. అలాంటి పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్‌కు వస్తోంది అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించిన “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు హరీష్ శంకర్‌తో కలిసి పవన్ చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలు సృష్టించింది. ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుండగా తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ స్పీచ్ మాత్రమే కాకుండా ఆయన లుక్ కూడా పెద్ద చర్చకు దారి తీసింది.
పవన్ కళ్యాణ్ చెప్పులపై సోషల్ మీడియాలో చర్చ
ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా పవన్ కళ్యాణ్ ధరించిన చెప్పులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అభిమానులు మాత్రమే కాకుండా నెటిజన్లు కూడా ఆయన వేసుకున్న చెప్పుల గురించి గూగుల్, ఏఐ ప్లాట్‌ఫార్మ్స్‌లో వెతుకుతూ వాటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ధరించిన ఆ చెప్పులు ప్రముఖ ఇటాలియన్ బ్రాండ్ కాసారే పాసియోట్టి (Cesare Paciotti) కి చెందినవని తెలుస్తోంది. వాటి ధర దాదాపు రూ.30,000 వరకు ఉండొచ్చని చెబుతున్నారు. ఆ చెప్పులపై కత్తి ఆకారంలో ఉన్న మెటల్ డిజైన్ ఉండడం వల్ల అవి మరింత స్టైలిష్‌గా కనిపిస్తున్నాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సింప్లిసిటీపై విమర్శలు.. అభిమానుల కౌంటర్
పవన్ కళ్యాణ్ ఎప్పుడూ సింపుల్‌గా ఉండే వ్యక్తి అని చెప్పుకుంటూ ఉంటాడు. అలాంటి వ్యక్తి ఇంత ఖరీదైన చెప్పులు ధరించడం అవసరమా అని కొందరు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. అయితే దీనికి పవన్ అభిమానులు గట్టిగానే సమాధానం ఇస్తున్నారు.
పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో ఒక్క సినిమాకు కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటాడని, అలాంటి వ్యక్తి రూ.30 వేల చెప్పులు ధరించడం పెద్ద విషయం కాదని వారు అంటున్నారు. ప్రస్తుతం కొత్త హీరోలు, చిన్న హీరోలు కూడా లక్షల రూపాయల బ్రాండెడ్ దుస్తులు ధరిస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ చెప్పుల ధరపై విమర్శలు చేయడం అర్థంలేనిదని అభిమానులు చెబుతున్నారు.
ఇది మొదటిసారి కాదు
పవన్ కళ్యాణ్ చెప్పుల గురించి చర్చ జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో “అత్తారింటికి దారేది” సినిమా సమయంలో కూడా ఆయన ధరించిన చెప్పులు, బ్రాండ్ల గురించి సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అప్పటినుంచే పవన్ కళ్యాణ్ ఖరీదైన బ్రాండ్లను ఉపయోగిస్తాడనే ప్రచారం కొనసాగుతోంది.
హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ సినిమా షూటింగ్‌ను కేవలం 45 రోజుల్లో పూర్తి చేశామని పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పడం విశేషం. ఇలాగే స్పీడ్‌గా సినిమాలు తీసే దర్శకులు వస్తే మరిన్ని సినిమాలు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన సంకేతాలు ఇచ్చారు.
ఈ చిత్రంలో హీరోయిన్‌గా శ్రీలీల నటించగా, ప్రత్యేక పాటతో పాటు చిన్న పాత్రలో రాశి ఖన్నా కనిపించనుంది. ఇప్పటికే భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా విడుదలకు ముందే మంచి హైప్ క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.250 కోట్ల వసూళ్ల టార్గెట్‌తో ఈ చిత్రం బాక్సాఫీస్ బరిలోకి దిగుతోంది. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో తెలుసుకోవాలంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram