Peddi | ‘పెద్ది’ రిలీజ్ రూమర్స్‌కు చెక్.. రాకాస మూవీ టీంని సాయం కోరిన రామ్ చ‌ర‌ణ్‌

Peddi | గ్లోబల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు స‌న‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్దిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. క్రికెట్, కుస్తీ అంశాలతో గ్రామీణ నేపథ్యంలోని యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, పాటలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి.

Ram Charan rugged look from Peddi movie poster

చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాకు సంబంధించిన టీజర్‌ను కూడా అదే రోజు విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం

Peddi | గ్లోబల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు స‌న‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్దిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. క్రికెట్, కుస్తీ అంశాలతో గ్రామీణ నేపథ్యంలోని యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, పాటలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి.

మొదట ఈ చిత్రాన్ని మార్చి 26న విడుదల చేయాలని భావించిన మేకర్స్, తర్వాత ఏప్రిల్ 30కి వాయిదా వేశారు. అయితే ఇటీవల షూటింగ్ పూర్తికాకపోవడంతో సినిమా మళ్లీ వాయిదా పడుతుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జూన్ లేదా జులైలో విడుదల చేసే అవకాశాలున్నాయని టాలీవుడ్‌లో చర్చ నడిచింది.

పెద్ది లేట్ కావ‌డం లేదు..

ఈ రూమర్స్‌తో అభిమానులు నిరాశ చెందుతున్న సమయంలో రామ్ చరణ్ స్వయంగా స్పందించి క్లారిటీ ఇచ్చారు. నిహారిక కొణిదెల‌ నిర్మించిన రాకాస ప్రమోషన్స్ సందర్భంగా మాట్లాడిన చరణ్, “పెద్ది లేట్ అవ్వట్లేదు అని కొంచెం బాగా ప్రమోట్ చేయండి.. బయట సినిమా వాయిదా పడుతుందని వింటున్నాను” అని స‌ర‌దాగా అన్నారు.

ఈ వ్యాఖ్యలతో ‘పెద్ది’ మళ్లీ వాయిదా పడదని స్పష్టమైంది. ఇప్పటికే ప్రకటించినట్లుగానే ఏప్రిల్ 30న సినిమా విడుదల అవుతుందని క్లారిటీ వచ్చింది. ఇదిలా ఉంటే, ఈ చిత్రంలో చరణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ క‌పూర్ నటిస్తోంది. అలాగే శివ‌రాజ్ కుమార్, జ‌గ‌ప‌తి బాబుu వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఏప్రిల్ 30నే పెద్ది..

సంగీతాన్ని ఏఆర్ రెహమాన్ అందిస్తుండగా, ఈ సినిమా నిర్మాణంలో వృద్ధి సినిమాస్‌తో పాటు మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు భాగస్వామ్యంగా ఉన్నాయి.

రామ్ చరణ్ స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇక ఎలాంటి అనుమానాలు లేకుండా ‘పెద్ది’ కోసం ఫ్యాన్స్ ఏప్రిల్ 30ని ఎదురుచూస్తున్నారు.

 

Latest News