Peddi | ‘పెద్ది’ సెట్స్ నుంచి లీక్ .. రామ్ చరణ్–శృతి హాసన్ స్పెషల్ సాంగ్ విజువల్స్ వైరల్
Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా తుదిదశ చిత్రీకరణలో ఉంది.
Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా తుదిదశ చిత్రీకరణలో ఉంది.
ఇటీవల ఈ చిత్ర యూనిట్ ప్రత్యేక గీతం చిత్రీకరణలో నిమగ్నమై ఉంది. అయితే ఈ గీతానికి సంబంధించిన కొన్ని దృశ్యాలు నేరుగా చిత్రీకరణ ప్రాంగణం నుంచే లీక్ కావడం చిత్రబృందాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ లీక్ వీడియోలో రామ్ చరణ్,శృతి హాసన్ కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ కనిపిస్తున్నారు.
స్పెషల్ సాంగ్ విజువల్స్..
ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ దృశ్యాల్లో శృతి హాసన్ ప్రత్యేక వేషధారణలో కనిపించడం గమనార్హం. చరణ్ తన శైలికి తగ్గట్టుగా ఉత్సాహభరితంగా అడుగులు వేస్తుంటే, శృతి హాసన్ కూడా అదే ఉత్సాహంతో సాధన చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ దృశ్యాలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నప్పటికీ, చిత్రబృందానికి మాత్రం భద్రతపై ఆందోళనలు కలిగిస్తున్నాయి.
ఈ ఘటనతో చిత్రీకరణ ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లు ఎంతవరకు కట్టుదిట్టంగా ఉన్నాయనే అంశం చర్చకు దారితీసింది. ఇటువంటి లీకులు సినిమా కథ, మొయిన్ థీమ్‌ని ముందుగానే బయటపెట్టే ప్రమాదం ఉన్నందున, యూనిట్ మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇక ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. వృద్ది సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి ‘పెద్ది’ నుంచి లీక్ అయిన ఈ డ్యాన్స్ విజువల్స్ ప్రస్తుతం విస్తృత చర్చకు దారితీస్తూ, సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram