Prabhas | సందీప్‌రెడ్డి వంగా బర్త్‌డే స్పెషల్… ‘స్పిరిట్’పై హైప్ పెంచిన ప్రభాస్ పోస్ట్
Prabhas | ‘అర్జున్‌రెడ్డి’, ‘కబీర్‌సింగ్’, ‘యానిమల్’ చిత్రాలతో ఇండియన్ సినీ పరిశ్రమను షేక్ చేసిన దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. రెగ్యులర్ సినిమా ఫార్ములాను బ్రేక్ చేస్తూ, తనదైన కథనం, ఇంటెన్స్ మేకింగ్‌తో సందీప్ రూపొందించిన సినిమాలు కేవలం బాక్సాఫీస్ రికార్డులకే కాదు… సినిమా మేకింగ్‌లో విప్లవాత్మక మార్పులకు కూడా నాంది పలికాయి.
Prabhas | ‘అర్జున్‌రెడ్డి’, ‘కబీర్‌సింగ్’, ‘యానిమల్’ చిత్రాలతో ఇండియన్ సినీ పరిశ్రమను షేక్ చేసిన దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. రెగ్యులర్ సినిమా ఫార్ములాను బ్రేక్ చేస్తూ, తనదైన కథనం, ఇంటెన్స్ మేకింగ్‌తో సందీప్ రూపొందించిన సినిమాలు కేవలం బాక్సాఫీస్ రికార్డులకే కాదు… సినిమా మేకింగ్‌లో విప్లవాత్మక మార్పులకు కూడా నాంది పలికాయి. ఇప్పటివరకు కేవలం రెండు సినిమాలే చేసినప్పటికీ, టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ప్రతి స్టార్ హీరో ఆయనతో పనిచేయాలని ఆసక్తిగా ఎదురుచూస్తుండటం సందీప్ క్రేజ్‌కు నిదర్శనం.
ఈ సందర్భంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సందీప్‌రెడ్డి వంగకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూనే, తమ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ కోసం తాను ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడో ప్రభాస్ వెల్లడించాడు. “పుట్టినరోజు శుభాకాంక్షలు బ్రో… నువ్వు సృష్టిస్తున్న దానిని అందరూ చూడటం కోసం నేను ఎదురుచూస్తున్నాను” అంటూ ప్రభాస్ చేసిన పోస్ట్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.ప్రభాస్ హీరోగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ ఒక భారీ రొమాంటిక్ యాక్షన్ కాప్ డ్రామాగా రూపొందుతోంది.
‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రీ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రకాశ్‌రాజ్, కాంచన, వివేక్ ఓబెరాయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నవంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించగా, జనవరి వరకు నిరంతరాయంగా షూటింగ్ కొనసాగనున్నట్లు సమాచారం. ఇక బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, ‘స్పిరిట్’లో హాట్ కంటెంట్ కూడా ‘యానిమల్’ని మించిపోయేలా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అందుకే సందీప్‌రెడ్డి వంగా త్రిప్తి దిమ్రీని హీరోయిన్‌గా ఎంపిక చేశారన్న ఇన్‌సైడ్ టాక్ కూడా ఉంది.ఇటీవల విడుదలైన ‘స్పిరిట్’ డైలాగ్ టీజర్ సినిమాపై హైప్‌ను పీక్స్‌కు తీసుకెళ్లింది. ఈ చిత్రం ప్రధానంగా జాతీయ భద్రతా సమస్య చుట్టూ తిరిగే కథతో సాగుతుందని, దేశ భద్రతకు పొంచి ఉన్న భారీ ప్రమాదాన్ని ఎదుర్కొనే నిజాయితీగల పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ కనిపించనున్నాడని సమాచారం. దేశ రక్షణే ధ్యేయంగా పనిచేసే పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో ప్రభాస్ యాక్షన్ సన్నివేశాలు గూస్‌బంప్స్ తెప్పిస్తాయంటూ ఇన్‌సైడ్ టాక్ వినిపిస్తోంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram