Ramayana | ‘రామాయణ’ తొలి గ్లింప్స్ విడుద‌ల‌.. దైవిక అనుభూతిని ఇస్తుంది అంటున్న సినీ విశ్లేషకులు

Ramayana | భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణం’ సినిమాకు సంబంధించిన తొలి గ్లింప్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చకు దారి తీస్తోంది. దర్శకుడు నితీష్ తివారీ రూపకల్పనలో, నిర్మాత నమిత్ మల్హోత్రా నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో కనిపిస్తున్నారు.

Ramayana | భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణం’ సినిమాకు సంబంధించిన తొలి గ్లింప్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చకు దారి తీస్తోంది. దర్శకుడు నితీష్ తివారీ రూపకల్పనలో, నిర్మాత నమిత్ మల్హోత్రా నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో కనిపిస్తున్నారు.

ఈ భారీ కాంబినేషన్ కారణంగా ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. హనుమాన్ జయంతి సందర్భంగా అధికారికంగా టీజర్ విడుదల చేశారు. ముందుగా విదేశాల్లో నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శనలో టీజ‌ర్ వీక్షించిన సినీ విశ్లేషకులు దీనిని “దైవిక అనుభూతి”గా అభివర్ణించారు. ఇందులో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ ఆకట్టుకుంటున్నారు. టెక్నికల్ అంశాలు, ప్రత్యేక వీఎఫ్ఎక్స్‌ సీన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

భారీ బ‌డ్జెట్‌తో..

సుమారు ₹4000 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం మొద‌టి భాగం దీపావళి కానుక‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. సుమారు 2 నిమిషాల 38 సెకన్ల నిడివి కలిగిన ఈ గ్లింప్స్‌లో విజువల్స్, గ్రాఫిక్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నాయి. హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తీసిపోని సాంకేతిక నాణ్యతతో భారతీయ ఇతిహాసాన్ని అద్భుతంగా ఆవిష్కరించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సెట్టింగ్స్ సహజత్వం, విజువల్ వైభవం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్ పూర్తిగా ఒదిగిపోయాడు. ఆయన లుక్‌లో దైవత్వం, ధైర్యం, ప్రశాంతత కనిపిస్తున్నాయని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పాత్ర తనకు దక్కడం జీవితంలో ఒక ముఖ్య ఘట్టమని రణబీర్ కపూర్ ఇప్పటికే వెల్లడించారు.

సంగీతం ప్ర‌ధాన ఆకర్ష‌ణ‌…

ఈ చిత్రానికి సంగీతం కూడా మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ప్రముఖ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్, హాన్జ్ జిమ్మర్ కలిసి అందిస్తున్న నేపథ్య సంగీతం టీజర్‌కు మరింత బలం చేకూర్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గంభీరమైన సన్నివేశాలకు సంగీతం మరింత వైభవాన్ని జోడించిందని చెబుతున్నారు. నటీనటుల ఎంపిక కూడా ఈ చిత్రానికి ప్రత్యేక బలం. సీత పాత్రలో సాయి పల్లవి, రావణుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. ఈ భారీ తారాగణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

రామాయణ కథను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగాన్ని 2026 దీపావళి సందర్భంగా విడుదల చేయనుండగా, రెండో భాగాన్ని 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ‘రామాయణం’ తొలి గ్లింప్స్‌తోనే భారతీయ సినిమా మరోసారి అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకునే దిశగా అడుగులు వేస్తోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రం కేవలం ప్రస్తుత తరానికే కాకుండా రాబోయే తరాలకు కూడా చిరస్మరణీయంగా నిలిచే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

 

Latest News