Virosh | విజయ్–రష్మిక పెళ్లి పార్టీలో ఫుల్ జోష్ .. బాలీవుడ్ పాటలకు రష్మిక స్టెప్పులు వైరల్

Virosh |  టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ–రష్మిక మందన్న వివాహానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

Virosh |  టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ–రష్మిక మందన్న వివాహానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉదయ్‌పూర్‌లో సన్నిహితుల సమక్షంలో వైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుకలు అప్పట్లోనే చర్చనీయాంశమయ్యాయి. తాజాగా పెళ్లి అనంతరం జరిగిన గ్రాండ్ పార్టీకి సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పార్టీ హైలైట్‌గా రష్మిక డ్యాన్స్

సెలబ్రిటీ డీజే డీజే గణేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతుండగా, ఈ వేడుకల్లో రష్మిక చేసిన సందడి గురించి వెల్లడించాడు. ఇది సౌత్ ఇండియన్ వెడ్డింగ్ అయినప్పటికీ, రష్మికకు బాలీవుడ్ పాటలంటే చాలా ఇష్టం. అందుకే నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించారు” అని ఆయన తెలిపారు.

రష్మిక తన ఫేవరెట్ సాంగ్ ‘సామీ సామీ’తో పాటు సల్మాన్ ఖాన్ హిట్ సాంగ్స్ ‘ముజ్సే షాదీ కరోగీ’, ‘జీనే కే చార్ దిన్’ పాటలకు ఉత్సాహంగా డ్యాన్స్ చేసినట్లు చెప్పారు. ఈ పార్టీ పెళ్లి వేడుకల్లో చివరి సెలబ్రేషన్ కావడంతో అందరూ ఎంతో ఎంజాయ్ చేశారని పేర్కొన్నారు.

ఎన్డీఏతో గోప్యత

ఈ వివాహం గురించి తనకు గత ఏడాది డిసెంబర్‌లోనే సమాచారం ఉందని, అయితే పెళ్లి వివరాలు బయటకు రాకుండా ఉండేందుకు నిర్వాహకులు ఎన్డీఏ (Non-Disclosure Agreement)పై సంతకాలు చేయించుకున్నారని డీజే గణేష్ వెల్లడించారు.

ఫోన్లపై ఎలాంటి ఆంక్షలు లేవు

సాధారణంగా సెలబ్రిటీ పెళ్లిళ్లలో ఫోన్లపై ఆంక్షలు ఉంటాయి. కానీ విజయ్–రష్మిక వివాహంలో అలాంటి పరిమితులు లేవని గణేష్ చెప్పారు. “నా దగ్గర ఫోన్ ఉన్నా నేను ఫోటోలు తీయనని వారికి నమ్మకం ఉంది” అని ఆయన పేర్కొన్నారు.

రెండు సంప్రదాయాల కలయిక

2018లో వచ్చిన ‘గీత గోవిందం’ సినిమా సమయంలో పరిచయమైన ఈ జంట, ‘డియర్ కామ్రేడ్’తో మరింత దగ్గరయ్యారు. అప్పటి నుంచి ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చినప్పటికీ, పెళ్లి వరకు గోప్యంగా ఉంచారు.

ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈ వివాహంలో విజయ్ కుటుంబానికి చెందిన తెలుగు సంప్రదాయాలు, రష్మిక కుటుంబానికి చెందిన కొడవ (కూర్గ్) సంప్రదాయాలను మేళవించి కార్యక్రమం నిర్వహించారు.

గ్రాండ్ రిసెప్షన్

హైదరాబాద్‌లో జరిగిన రిసెప్షన్‌కు రామ్ చరణ్, అల్లు అర్జున్, కృతి సనన్, కరణ్ జోహార్ వంటి ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. పెళ్లి తర్వాత ఈ జంట మళ్లీ సినిమాలతో బిజీ అయ్యింది. దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్న ‘రణబాలి’ చిత్రంలో విజయ్–రష్మిక కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 11, 2026న విడుదల కానుంది.

Latest News