Rashmika | ర‌ష్మిక ఖాతాలో మ‌రో హిట్ చేర‌డం ఖాయం.. మైసా గ్లింప్స్‌కి ఫిదా కావల్సిందే..!

Rashmika | నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్న సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’ న‌వంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చి మంచి హిట్ ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందే, ఆమె నెక్స్ట్ మూవీ ‘మైసా’ పై ఫోకస్ పెట్టింది.

  • By: sn |    movies |    Published on : Dec 24, 2025 1:48 PM IST
Rashmika | ర‌ష్మిక ఖాతాలో మ‌రో హిట్ చేర‌డం ఖాయం.. మైసా గ్లింప్స్‌కి ఫిదా కావల్సిందే..!

Rashmika | నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్న సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’ న‌వంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చి మంచి హిట్ ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందే, ఆమె నెక్స్ట్ మూవీ ‘మైసా’ పై ఫోకస్ పెట్టింది. ఈ చిత్రంలో రష్మిక తొలిసారి వారియర్‌గా కనిపించబోతుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ‘మైసా’ సినిమాకు రవీంద్ర పూలే దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకు ఇది డైరెక్టర్‌గా తొలి చిత్రం కావడం విశేషం. సినిమా షూటింగ్‌ను కేరళలోని అతిరప్పలి అటవీ ప్రాంతంలో ప్రారంభించినట్లు డైరెక్టర్ వెల్లడించారు.

చిత్ర షూటింగ్ ప్రారంభించిన స‌మ‌యంలో ద‌ర్శ‌కుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో, ప్రతి కథ మొదటి ప్రేమకు ముందే దాని లయను కనుగొంటుంది. జలపాతాలు, అడవుల గుసగుసల్లో, సృష్టి ముందు ఉన్న ప్రశాంతతలో… ఈ దృష్టి ఊపిరి పీల్చుకోవడం ప్రారంభిస్తుంది” అంటూ భావోద్వేగ పోస్ట్ షేర్ చేశారు. ఈ పోస్ట్ నెటిజ‌న్స్‌ని ఆక‌ట్టుకుంది.

పవర్‌ఫుల్ గోండు గిరిజన లుక్

ఈ చిత్రంలో రష్మిక గోండు గిరిజన మహిళగా కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఆమెను ఎప్పుడూ చూడని విధంగా, డిఫరెంట్, మాస్, భయానక లుక్‌లో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ‘మైసా’ అనే పదానికి “అమ్మ” అనే అర్థం ఉండగా, గోండు తెగల బ్యాక్‌డ్రాప్‌లో ఓ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.స్వేచ్ఛా ఆలోచనలతో ఎదిగిన ఓ సహజ నాయకురాలి పాత్రలో, యోధురాలిగా రష్మిక కనిపించనుందని మేకర్స్ వెల్లడించారు.

పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణం

‘మైసా’ సినిమాను అన్ ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై అజయ్, అనిల్ సయ్యపురెడ్డి పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. రష్మికతో పాటు, ‘పుష్ప 2’లో విలన్ పాత్రతో మెప్పించిన తారక్ పొన్నప్ప కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ సినిమాకు పని చేసిన ఆండీ లాంగ్ గ్యుయెన్ ఈ చిత్రానికి స్టంట్ మాస్టర్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

గ్లింప్స్ అదిరింది…

తాజాగా విడుద‌లైన గ్లింప్స్ మాత్రం మూవీపై మ‌రిన్ని అంచ‌నాలు పెంచింది. ర‌ష్మిక పాత్ర‌ని ప‌రిచ‌యం చేస్తూ.. నా బిడ్డ ఊపిరిని మోయ‌లేక చావే అగ్గే బూడిదైంది. నా బిడ్డ‌ని సంప‌లేక ఆఖ‌రికి సావే స‌చ్చిపోయింది అనే ప‌వ‌ర్ ఫుల్ డైలాగుల‌తో మైసా గ్లింప్స్ చాలా ఆస‌క్తికరంగా ఉంది. చూస్తుంటే ఈ చిత్రంతో మ‌రో మంచి హిట్ ర‌ష్మిక త‌న ఖాతాలో వేసుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఇప్పటికే కాన్సెప్ట్‌, రష్మిక లుక్‌తో అంచనాలు పెంచుతున్న ‘మైసా’ సినిమాకు సంబంధించి, త్వరలోనే ఇతర నటీనటులు, షూటింగ్ వివరాలపై మరిన్ని అప్డేట్స్ విడుదల చేనున్నట్లు మేకర్స్ తెలిపారు. రష్మిక కెరీర్‌లో మరో డిఫరెంట్, పవర్‌ఫుల్ మూవీగా ‘మైసా’ నిలవనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.