Vijay- Rashmika | విజయ్ దేవరకొండని హ‌గ్ చేసుకుంది రష్మికనేనా.. ఆ ఫొటోపైనే అంద‌రి ఫోక‌స్

Vijay- Rashmika | టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారన్న వార్తలు ఇండస్ట్రీలోనే కాదు, సోషల్ మీడియాలోనూ హల్‌చల్ చేస్తున్నాయి. వీరిద్దరూ సైలెంట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారన్న టాక్ మరింతగా ఊపందుకుంది.

  • By: sn |    movies |    Published on : Jan 03, 2026 10:00 AM IST
Vijay- Rashmika | విజయ్ దేవరకొండని హ‌గ్ చేసుకుంది రష్మికనేనా.. ఆ ఫొటోపైనే అంద‌రి ఫోక‌స్

Vijay- Rashmika | టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారన్న వార్తలు ఇండస్ట్రీలోనే కాదు, సోషల్ మీడియాలోనూ హల్‌చల్ చేస్తున్నాయి. వీరిద్దరూ సైలెంట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారన్న టాక్ మరింతగా ఊపందుకుంది. అత్యంత గోప్యంగా, కేవలం కొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యనే నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇప్పటివరకు తమ రిలేషన్‌ను పూర్తిగా ప్రైవేట్‌గా ఉంచిన విజయ్–రష్మిక జంటపై అభిమానులు మాత్రం ఎప్పటినుంచో కన్నేసి ఉంచారు.

వీరిద్దరూ ఒకే లొకేషన్‌లో కనిపించినా, వెకేషన్‌లకు వెళ్లినా, వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా విజయ్ దేవరకొండ షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు మరోసారి చర్చకు దారి తీశాయి.తమ్ముడు, స్నేహితులతో కలిసి వెకేషన్‌లో ఉన్నట్లు కనిపిస్తున్న ఈ ఫోటోలలో ఒకటి ప్రత్యేకంగా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ ఫోటోలో విజయ్ దేవరకొండను వెనక నుంచి ఓ అమ్మాయి హగ్ చేసుకున్నట్లు కనిపించడంతో, ఆమె రష్మిక మందన్నేనని నెటిజన్లు ఊహిస్తున్నారు. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత కూడా ఈ జంట ఇంత సీక్రెట్‌గా ఎందుకు ఉంటోంది? అంటూ కొందరు ప్రశ్నిస్తుంటే, మరికొందరు మాత్రం ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక వీరి పెళ్లిపై కూడా ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. ఇన్‌సైడ్ టాక్ ప్రకారం, విజయ్ దేవరకొండ–రష్మిక మందన్న వివాహం రాజస్థాన్‌లోని ఉదయపూర్ ప్యాలెస్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 26న పెళ్లి జరిగే అవకాశముందని సమాచారం. నిశ్చితార్థంలాగే, వివాహాన్ని కూడా అత్యంత సైలెంట్‌గా, మీడియా హడావుడి లేకుండా నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. ప్రస్తుతం ఇవన్నీ ఊహాగానాలే అయినప్పటికీ, త్వరలోనే ఈ జంట నుంచి అధికారిక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అప్పటివరకు విజయ్–రష్మిక పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో మరింత హీట్ పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.