RGV | పైరసీపై యుద్ధం చేస్తున్న సినీ పరిశ్రమ.. నేను పైరసీ సినిమాలే చూస్తానంటూ స్టన్నింగ్ కామెంట్స్ చేసిన ఆర్జీవి
RGV | సినిమా ప్రేమికులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు రామ్ గోపాల్ వర్మ. ఒకప్పుడు తన సొంత మార్క్‌తో తెలుగు ప్రేక్షకుల హృదయాలని దోచుకున్న ఈ దర్శకుడు, ఇటీవలి కాలంలో మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్ట్‌లు, పబ్లిక్ స్టేట్‌మెంట్స్ కారణంగానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు.
RGV | సినిమా ప్రేమికులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు రామ్ గోపాల్ వర్మ. ఒకప్పుడు తన సొంత మార్క్‌తో తెలుగు ప్రేక్షకుల హృదయాలని దోచుకున్న ఈ దర్శకుడు, ఇటీవలి కాలంలో మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్ట్‌లు, పబ్లిక్ స్టేట్‌మెంట్స్ కారణంగానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. వర్మ ఏ మాట అన్నా, ఏ ట్వీట్ చేసినా వెంటనే పెద్ద ఎత్తున చర్చ మొదలవడం కొత్తేమీ కాదు. రీసెంట్‌గా ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుతో పాటు పైరసీపై సినీ పరిశ్రమలో మళ్లీ పెద్ద చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
“ఆసక్తి ఉంటే థియేటర్.. ఆసక్తి లేకపోతే పైరసీ”.. వర్మ
తాను కూడా పైరసీ సినిమాలు చూస్తానంటూ వర్మ స్పష్టంగా చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. నాకు ఆసక్తి ఉంటేనే సినిమా థియేటర్‌కి వెళ్తా. ఆసక్తి లేకపోతే పైరసీలోనే చూస్తా. ప్రేక్షకులు ఏది తక్కువ ఖర్చులో దొరుకుతుందో అదే చూస్తారు. వాళ్ల మెంటాలిటీను ఎవరూ మార్చలేరు. టెక్నాలజీ ఉన్నంత వరకు పైరసీని ఆపడం అసాధ్యం ” అని వర్మ వ్యాఖ్యానించారు.
నిర్మాతలు, సినీ పరిశ్రమపై కూడా విమర్శలు
సినిమా వాళ్లు పైరసీ చూడొద్దు అంటారు. ఇండస్ట్రీని చంపేస్తారని చెబుతారు. కానీ మీకు 30 కోట్లు వచ్చినా కూడా ఇంకా ఎక్కువ కావాలంటే ప్రేక్షకులపై ఎందుకు భారం పెడతారు? రెమ్యునరేషన్లను మీరు పెంచేసుకుని ఆ మొత్తం డబ్బుల్ని ప్రేక్షకుల జేబుల నుంచి రాబట్టాలని ఎలా ఆశిస్తారు? అని వర్మ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం విడుదలైన చాలా సినిమాలు మొదటి రోజుకే ఆన్‌లైన్‌లో హెచ్‌డీ ప్రింట్ రూపంలో దొరుకుతున్నాయి. దీంతో నిర్మాతలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. పైరసీని అరికట్టేందుకు ప్రభుత్వం, పలు సంస్థలు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ సమస్య పూర్తిగా తగ్గలేదని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.
అయితే ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడంపై చాలామంది సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేసిన ఈ సమయంలో, రామ్ గోపాల్ వర్మ మాత్రం నేను కూడా పైరసీలోనే చూస్తా ” అని చెప్పడం మరో వివాదానికి తెరలేపింది. సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారితీశాయి. కొందరు వర్మను సపోర్ట్ చేస్తున్నా, చాలా మంది మాత్రం దర్శకుడిగా ఆయన బాధ్యతను గుర్తుచేస్తూ విమర్శలు చేస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram