Sai Pallavi | సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ‘ఏక్ దిన్’ ఫస్ట్ లుక్‌పై కాపీ వివాదం .. నెటిజన్ల విమర్శల వెల్లువ
Sai Pallavi | ప్రముఖ నటి సాయి పల్లవి హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్న తొలి సినిమా ‘ఏక్ దిన్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైనప్పటి నుంచే వివాదాస్పదంగా మారింది. గురువారం చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్‌పై సోషల్ మీడియా వేదికలైన ట్విట్టర్ (ఎక్స్), రెడిట్, ఇన్‌స్టాగ్రామ్‌లలో తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Sai Pallavi | ప్రముఖ నటి సాయి పల్లవి హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్న తొలి సినిమా ‘ఏక్ దిన్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైనప్పటి నుంచే వివాదాస్పదంగా మారింది. గురువారం చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్‌పై సోషల్ మీడియా వేదికలైన ట్విట్టర్ (ఎక్స్), రెడిట్, ఇన్‌స్టాగ్రామ్‌లలో తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం, పోస్టర్ పరంగా ఓ థాయ్ సినిమా నుంచి కాపీ చేసిందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చర్చ ప్రకారం, ‘ఏక్ దిన్’ చిత్రం ఒక థాయ్ రొమాంటిక్ డ్రామాకు అధికారిక రీమేక్ అని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, ఒరిజినల్ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను దాదాపు యథాతథంగా వాడేశారని యూజర్లు అంటున్నారు. పోస్టర్ డిజైన్ మాత్రమే కాకుండా, సినిమా టైటిల్ కూడా అసలు థాయ్ టైటిల్‌కు హిందీ అనువాదంలా ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. “ఇది ఇన్‌స్పిరేషన్ కాదు, నేరుగా కాపీ. పోస్టర్ నుంచి టైటిల్ వరకూ అన్నీ అదేలా ఉన్నాయి” అని ఓ యూజర్ వ్యాఖ్యానించగా, “రీమేక్ అయినా సరే… కనీసం కొత్త ఐడియాతో పోస్టర్ డిజైన్ చేయొచ్చుగా” అంటూ మరో యూజర్ విమర్శించారు.
సాయి పల్లవి వంటి నేచురల్ యాక్టింగ్‌కు పేరున్న నటితో, బాలీవుడ్‌లో తొలి సినిమా కావడంతో ‘ఏక్ దిన్’పై మొదటినుంచే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఫస్ట్ లుక్‌తోనే కాపీ ఆరోపణలు రావడం సినిమాపై నెగటివ్ డిస్కషన్‌కు దారితీసింది. ముఖ్యంగా ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో, కంటెంట్ మరియు ప్రెజెంటేషన్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాల్సిందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్న ఈ రొమాంటిక్ డ్రామాను ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. మే 1న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఫస్ట్ లుక్ పోస్టర్‌పై వస్తున్న కాపీ ఆరోపణలపై ఇప్పటివరకు దర్శకుడు గానీ, నిర్మాతలు గానీ ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. ఇక ఈ వివాదం నేపథ్యంలో, మేకర్స్ నుంచి స్పష్టత వస్తుందా? లేక ప్రచారంలో భాగంగానే ఈ చర్చ కొనసాగుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. సాయి పల్లవి బాలీవుడ్ ప్రయాణం ఈ సినిమాతో ఎలా మొదలవుతుందో చూడాల్సిందే.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram