Srikanth | టాలీవుడ్ స్టార్ హీరో శ్రీకాంత్‌కు ఈ స్టార్ నటి బంధువు అని మీకు తెలుసా?.. ఏం వరుస అవుతుందంటే..!
Srikanth | టాలీవుడ్‌లో హ్యాండ్సమ్ హీరోల జాబితాలో శ్రీకాంత్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కెరీర్ ప్రారంభంలో విలన్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన, ఆ తర్వాత హీరోగా వరుస విజయాలతో స్టార్ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. కాలంతో పాటు తన నటనను మార్చుకుంటూ ప్రస్తుతం విలన్, సహాయక పాత్రలతోనూ ఆకట్టుకుంటున్నారు.
Srikanth | టాలీవుడ్‌లో హ్యాండ్సమ్ హీరోల జాబితాలో శ్రీకాంత్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కెరీర్ ప్రారంభంలో విలన్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన, ఆ తర్వాత హీరోగా వరుస విజయాలతో స్టార్ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. కాలంతో పాటు తన నటనను మార్చుకుంటూ ప్రస్తుతం విలన్, సహాయక పాత్రలతోనూ ఆకట్టుకుంటున్నారు.శ్రీకాంత్ కుటుంబానికి సినిమా ఇండస్ట్రీతో గట్టి అనుబంధం ఉంది. ఆయన సతీమణి ఊహా ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారు. అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఊహా అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు
ఇక శ్రీకాంత్ కుమారుడు రోషన్ ‘నిర్మలా కాన్వెంట్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, ‘పెళ్లి సందడి’తో మంచి విజయాన్ని అందుకున్నాడు. తాజాగా ‘ఛాంపియన్’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక శ్రీకాంత్ సోదరుడు అనిల్ కుమార్ కూడా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ‘ప్రేమించేయి ఎందుకమ్మా’ సినిమాతో హీరోగా ప్రయత్నించడమే కాకుండా, తర్వాత శ్రీకాంత్ నటించిన కొన్ని సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించాడు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే… శ్రీకాంత్ చెల్లెలు కూడా టాలీవుడ్‌లో స్టార్ నటి కావడమే. ఆమె మరెవరో కాదు అనితా చౌదరి.
ఆమె పేరు చెప్పగానే గుర్తు రాకపోయినా, ప్రభాస్ నటించిన ‘ఛత్రపతి’ సినిమాలో “ఓ సూరీడు… బస్సుకు యాలైతాందిరా యాడికి పోయావ్” అంటూ అంధురాలి పాత్రలో కనిపించిన నటి అంటే మాత్రం ఇట్టే గుర్తొస్తుంది. అనితా చౌదరి తెలుగులో దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించారు. రాజా, మురారి, సంతోషం, ఆనందం, నువ్వే నువ్వే, గోల్‌మాల్, ఛత్రపతి, మన్మథుడు, నిన్నే ఇష్టపడ్డాను, ఉయ్యాల జంపాల, కేరింత, గురు, జాంబీ రెడ్డి వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినిమాలతో పాటు కొన్ని టీవీ షోలలోనూ సందడి చేశారు.
ఇటీవల ‘లిటిల్ హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ వంటి సంచలన విజయాలు సాధించిన చిత్రాల్లో హీరోకు తల్లిగా నటించి మరోసారి ప్రశంసలు అందుకుంటున్నారు. వ్యక్తిగత జీవితానికి వస్తే… అనితా చౌదరి కృష్ణ చైతన్య అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కృష్ణ చైతన్య శ్రీకాంత్‌కు దగ్గరి బంధువు కావడం విశేషం. వీరి వివాహాన్ని శ్రీకాంత్ స్వయంగా దగ్గరుండి జరిపించారని అనితా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం అనితా–కృష్ణ చైతన్య దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. ఇలా నటిగా, కుటుంబ సభ్యురాలిగా టాలీవుడ్‌తో బలమైన అనుబంధం ఉన్న అనితా చౌదరి మరోసారి వార్తల్లో నిలిచారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram