Comedian | పవన్,నిహారికలపై అనుచిత వ్యాఖ్యలు.. స్టాండప్ కమెడియన్ అనుదీప్ అరెస్ట్
Comedian | పవన్,నిహారికలపై అనుచిత వ్యాఖ్యలు.. స్టాండప్ కమెడియన్ అనుదీప్ అరెస్ట్సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలతో వివాదానికి దారితీసిన స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికాల అరెస్ట్ కావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. కామెడీ పేరుతో వ్యక్తిగతంగా దూషణలు చేయడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.
Comedian | పవన్,నిహారికలపై అనుచిత వ్యాఖ్యలు.. స్టాండప్ కమెడియన్ అనుదీప్ అరెస్ట్సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలతో వివాదానికి దారితీసిన స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికాల అరెస్ట్ కావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. కామెడీ పేరుతో వ్యక్తిగతంగా దూషణలు చేయడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.
ఇటీవల అనుదీప్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో పాటు ప్రముఖ నటులు రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన కామినేని , అలాగే నిహారిక కొణిదెలపై చేసిన వ్యక్తిగత, అసభ్యకర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొబైల్ లొకేషన్ ఆధారంగా గుర్తింపు..
వివాదం మరింత పెరగడంతో అనుదీప్ క్షమాపణలు చెప్పినప్పటికీ, జనసేన పార్టీ నాయకులు చట్టపరమైన చర్యలకు దిగారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అతడి కదలికలను గమనిస్తూ దర్యాప్తు ప్రారంభించారు.
సమాచారం ప్రకారం, ప్రయాగరాజ్‌లో తన తండ్రితో ఉన్న సమయంలో మొబైల్ లొకేషన్ ఆధారంగా పోలీసులు అనుదీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు తరలించి విచారణ కొనసాగిస్తున్నారు.
కఠిన చర్యలు తీసుకోవాలి..
పోలీసుల దర్యాప్తులో, అనుదీప్ గతంలో కూడా పలువురు సినీ ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం బయటకు వచ్చింది. ముఖ్యంగా అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్‌లపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.
ఈ అరెస్ట్ నేపథ్యంలో నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. భావప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరచడం అంగీకారయోగ్యం కాదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటనతో కామెడీకి కూడా ఒక పరిమితి ఉండాలని, ఆ హద్దులు దాటితే చట్టపరమైన పరిణామాలు తప్పవని స్పష్టమైంది. ఇకపై సోషల్ మీడియా వేదికగా ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ సంఘటన బలంగా గుర్తుచేస్తోంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram