Trisha | విజయ్ ఘన విజయం.. త్రిష పేరు ట్రెండింగ్‌లోకి, సెలబ్రిటీల రియాక్షన్స్ వైరల్!

Trisha | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన ఫలితాలు వెలువడుతున్నాయి. నటుడు విజ‌య్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ఊహించని విధంగా భారీ ఆధిక్యంతో ముందంజలో కొనసాగుతోంది. ఇప్పటికే 110కి పైగా స్థానాల్లో ఆధిక్యం సాధించిన టీవీకే పార్టీ అధికారాన్ని చేపట్టడం ఖాయమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో విజయ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టడం దాదాపు లాంఛనంగా మారింది.

  • By: Sandeep |    movies |    Published on : May 04, 2026 4:07 PM IST
Trisha | విజయ్ ఘన విజయం.. త్రిష పేరు ట్రెండింగ్‌లోకి, సెలబ్రిటీల రియాక్షన్స్ వైరల్!

Trisha | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన ఫలితాలు వెలువడుతున్నాయి. నటుడు విజ‌య్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ఊహించని విధంగా భారీ ఆధిక్యంతో ముందంజలో కొనసాగుతోంది. ఇప్పటికే 110కి పైగా స్థానాల్లో ఆధిక్యం సాధించిన టీవీకే పార్టీ అధికారాన్ని చేపట్టడం ఖాయమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో విజయ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టడం దాదాపు లాంఛనంగా మారింది.

విజయ్ విజయం నేపథ్యంలో సినీ పరిశ్రమల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, శాండల్‌వుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు.

దివ్వెల మాధురి పోస్ట్ వైరల్..

ఈ క్రమంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ దివ్వెల మాధురి చేసిన పోస్టు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో “త్రిష కోరికతో పాటు టీవీకే విజయ్ గెలవాలన్న నా కోరిక కూడా నెరవేరింది. వ్యక్తిగత జీవితానికి రాజకీయాలకు సంబంధం లేదు. వ్యక్తిగత విషయాలు రాజకీయాల్లో ప్రభావం చూపితే ఎవ్వరూ రాజకీయాల్లో నిలబడలేరు. కంగ్రాట్యులేషన్స్ విజయ్ గారు” అంటూ పేర్కొంది.

ఇదే సమయంలో నిర్మాత బండ్ల గ‌ణేష్ కూడా త్రిషను ట్యాగ్ చేస్తూ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. “తిరుమల వెంకటేశ్వరుడి ఆశీస్సులతో మీ కల నిజం కాబోతోంది… కంగ్రాట్స్ త్రిష” అంటూ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

ట్రెండింగ్‌లో త్రిష పేరు..

ఈ పరిణామాలతో నటి త్రిష కృష్ణ‌న్ పేరు కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. గత కొంతకాలంగా విజయ్, త్రిష మధ్య వ్యక్తిగత సంబంధంపై రూమర్లు వినిపిస్తున్న నేపథ్యంలో, ఈ పోస్టులు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ఇటీవల ఇద్దరూ కలిసి ఒక పెళ్లి వేడుకకు హాజరైన దృశ్యాలు బయటకు రావడంతో ఆ ప్రచారాలకు మరింత బలం చేకూరింది. ఇదిలా ఉండగా, యాదృచ్ఛికంగా ఈరోజే త్రిష పుట్టినరోజు కావడం, అదే రోజున ఎన్నికల ఫలితాలు వెలువడటం, అందులో విజయ్ భారీ విజయం సాధించడం అన్నీ కలిసి ఆమె పేరును సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మార్చాయి.