Trivikram | మళ్లీ త్రివిక్రమ్ కాపీ ఆరోపణల వివాదం… హాలీవుడ్ నుంచి లేపేసాడంటూ ట్రోలింగ్
Trivikram | సినీ పరిశ్రమలో మాటల రచయితగా కెరీర్ ప్రారంభించి, స్టార్ హీరోల చిత్రాలకు దర్శకుడిగా ఎదిగిన త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్ ఉంది. ఆయన రాసే డైలాగులు, కుటుంబ భావోద్వేగాలతో మిళితమైన కథనం, సున్నితమైన హాస్యం “మాటల మాంత్రికుడు”గా ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి.
Trivikram | సినీ పరిశ్రమలో మాటల రచయితగా కెరీర్ ప్రారంభించి, స్టార్ హీరోల చిత్రాలకు దర్శకుడిగా ఎదిగిన త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్ ఉంది. ఆయన రాసే డైలాగులు, కుటుంబ భావోద్వేగాలతో మిళితమైన కథనం, సున్నితమైన హాస్యం “మాటల మాంత్రికుడు”గా ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, ఎన్టీఆర్‌లతో చేసిన సినిమాలు వరుస విజయాలను అందించాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు నటించిన ‘అతడు’ సినిమా తెలుగు ప్రేక్షకులకి ఎంత దగ్గరైందో తెలిసిందే.
ఈ చిత్రంలో మొదట్లో వచ్చే యాక్షన్ సీన్ మహేశ్ బాబు బిల్డింగ్‌పై నుంచి తాడు సాయంతో వెళ్తున్న రైలు మీదికి దూకి తప్పించుకునే సన్నివేశం అప్పుడు థియేటర్లలో భారీ స్పందన పొందింది. ప్రకాష్ రాజ్ చెప్పే “వీడు ఒలింపిక్స్ కి వెళ్తే గోల్డ్ మెడల్ వచ్చేదయ్యా!” అన్న డైలాగ్ కూడా అప్పట్లో చార్ట్‌బస్టర్‌గా మారింది.
1998 హాలీవుడ్ మూవీతో ఫ్రేమ్ టు ఫ్రేమ్ పోలికలు
ఇటీవల సోషల్ మీడియాలో ఈ సీన్‌పై పెద్ద చర్చ జరుగుతోంది. 1998లో విడుదలైన హాలీవుడ్ క్లాసిక్ ‘US Marshals’ చిత్రంలో కూడా ఇలాంటి సన్నివేశం ఉందని నెటిజన్లు వీడియోలతో రుజువు చేస్తున్నారు. రెండు సీన్లు “ఫ్రేమ్ టు ఫ్రేమ్”గా ఒకేలా ఉన్నాయంటూ క్లిప్పింగ్స్ షేర్ చేస్తూ త్రివిక్రమ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.
త్రివిక్రమ్ నుండి ఇది ఊహించలేదు ..
ఈ వీడియోలు వైరల్ కావడంతో, నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. త్రివిక్రమ్ ఇలా కాపీ కొడతాడని నమ్మలేకపోతున్నాం , అమ్మ గురూజీ… ఇన్నాళ్లు ఎంత మోసం చేశావ్ .. ఇలాంటి కామెంట్లతో సోషల్ మీడియాలో ఆయనపై ట్రోలింగ్ కొనసాగుతోంది. అయితే త్రివిక్రమ్ అభిమానులు మాత్రం ఈ కామెంట్లని తిప్పి కొడుతున్నారు. హాలీవుడ్ సీన్‌ని అలాగే తెలుగు నేటివిటీకి మార్చి డిజైన్ చేశారు. ఇది కాపీ కాదు, ప్రేరణ మాత్రమే అని ఫ్యాన్స్ వాదిస్తున్నారు. అంతర్జాతీయ సినిమాల నుంచి ఇలాంటి యాక్షన్ బీట్స్ తీసుకోవడం ప్రపంచవ్యాప్తంగా సాధారణమే అని అంటున్నారు.
త్రివిక్రమ్‌పై ఇలాంటి అడాప్షన్ లేదంటే పోలికల ఆరోపణలు ఇప్పటిదాకా చాలా వచ్చాయి. కొన్ని కామెడీ ట్రాక్స్, యాక్షన్ ఎపిసోడ్స్, డ్రామాటిక్ మోమెంట్స్‌లో ఇతర సినిమాలతో పోలికలు ఉన్నాయని నెటిజన్లు అప్పుడప్పుడూ సూచిస్తుంటారు. కానీ ఆయన డైలాగ్ రైటింగ్ స్టైల్, భావోద్వేగాల ప్రెజెంటేషన్ కారణంగా ఈ విమర్శలు పెద్దగా ప్రభావం చూపలేదు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram