VeeraBhadrudu | ‘వీరభద్రుడు’ ట్రైలర్‌తో ఆకాశాన్నంటుతున్న అంచ‌నాలు.. సూర్య మాస్ అవతార్‌కు ఫ్యాన్స్ ఫిదా!

VeeraBhadrudu | తమిళ స్టార్ హీరో సూర్య‌ నటిస్తున్న భారీ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘వీరభద్రుడు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. మే 14, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

  • By: Sandeep |    movies |    Published on : May 12, 2026 7:45 AM IST
VeeraBhadrudu | ‘వీరభద్రుడు’ ట్రైలర్‌తో ఆకాశాన్నంటుతున్న అంచ‌నాలు.. సూర్య మాస్ అవతార్‌కు ఫ్యాన్స్ ఫిదా!

VeeraBhadrudu | తమిళ స్టార్ హీరో సూర్య‌ నటిస్తున్న భారీ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘వీరభద్రుడు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. మే 14, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

సోమవారం మేకర్స్ విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబట్టగా, ఇప్పుడు ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేసింది. ముఖ్యంగా సూర్యను ఈ సినిమాలో పూర్తిస్థాయి మాస్ అవతార్‌లో చూపించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది.

చాలా బలంగా..

ట్రైలర్‌ను బట్టి చూస్తే ‘వీరభద్రుడు’ ఒక పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కినట్లు స్పష్టమవుతోంది. సమాజంలో అన్యాయాలకు ఎదురు నిలిచే వ్యక్తిగా సూర్య పాత్ర కనిపిస్తుండగా, ఆయన డైలాగులు, యాక్షన్ సీన్స్ ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. పేరుకు తగ్గట్టుగానే వీరభద్రుడి పాత్రను చాలా బలంగా డిజైన్ చేసినట్లు కనిపిస్తోంది.

ఈ చిత్రంలో హీరోయిన్‌గా త్రిష కృష్ఱ‌న్ నటిస్తుండగా, ఆమె పాత్ర కూడా కథలో కీలకంగా ఉండబోతున్నట్లు ట్రైలర్ హింట్ ఇచ్చింది. మరోవైపు దర్శకుడు ఆర్జే బాలాజీ ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు స్పష్టమైంది. హీరో-విలన్ మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్ సినిమాకు ప్రధాన బలంగా ఉండబోతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

మంచి హిట్ కోసం..

కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా, మంచి మెసేజ్‌ను కూడా సినిమాలో జోడించినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. యాక్షన్, ఎమోషన్స్, కోర్ట్‌రూమ్ డ్రామా, సామాజిక అంశాలు అన్నింటినీ మిక్స్ చేస్తూ సినిమాను తెరకెక్కించినట్లు కనిపిస్తోంది.

టెక్నికల్‌గా కూడా ‘వీరభద్రుడు’ చాలా గ్రాండ్‌గా కనిపిస్తోంది. ముఖ్యంగా యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంక‌ర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. విజువల్స్, యాక్షన్ బ్లాక్స్, డైలాగ్స్ అన్నీ కలిపి సినిమాకు పాన్ ఇండియా ఫీల్ తీసుకొచ్చాయి.

గత కొన్ని సంవత్సరాలుగా సూర్యకు తమిళంలో మంచి గుర్తింపు ఉన్నప్పటికీ, తెలుగులో మాత్రం ఆయనకు పెద్ద మాస్ హిట్ రాలేదు. అయితే ‘వీరభద్రుడు’ ఆ లోటును తీర్చే సినిమా అవుతుందనే అభిప్రాయం ట్రైలర్ చూసిన తర్వాత అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో “సూర్య కంబ్యాక్ ఖాయం” అంటూ ఫ్యాన్స్ పోస్టులు వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం పెద్దగా పోటీ సినిమాలు లేకపోవడం కూడా ‘వీరభద్రుడు’కు కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది. ట్రైలర్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం విడుదల తర్వాత ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. మే 14న బాక్సాఫీస్ వద్ద సూర్య మాస్ మ్యాజిక్ ఎలా ఉంటుందనే ఆసక్తి ఇప్పుడు సినీ అభిమానుల్లో నెలకొంది.