Pawan Kalyan|పవన్ కళ్యాణ్‌తో విజయ్‌కి పోలికలు పెడుతున్న ఫ్యాన్స్.. ఇద్దరి దారులు ఒకటేనా?
Pawan Kalyan| టాలీవుడ్ స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ 2014లో రాజకీయాలలోకి వచ్చారు. అయితే రాజకీయాలలోకి రాకముందు నుండే పవన్ ప్రజా సమస్యలపై స్పందిస్తూ ఉంటారు. ఇక 2014లోనే పార్టీ పెట్టినప్పటికీ ఆయనకు ఎమ్మెల్యే అవ్వడానికి పదేళ్లు పట్టిన పరిస్థితి. 2014లో పోటీ చేయకపోయినా.. 2019లో పోటీ చేసిన రెండుచోట్లా ఓటమి పాలయ్యారు.2024 ఎన్నికల్లో మాత్రం బీజేపీ - టీడీపీతో జతకట్టిన కూటమిలో ఎ
Pawan Kalyan| టాలీవుడ్ స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ 2014లో రాజకీయాలలోకి వచ్చారు. అయితే రాజకీయాలలోకి రాకముందు నుండే పవన్ ప్రజా సమస్యలపై స్పందిస్తూ ఉంటారు. ఇక 2014లోనే పార్టీ పెట్టినప్పటికీ ఆయనకు ఎమ్మెల్యే అవ్వడానికి పదేళ్లు పట్టిన పరిస్థితి. 2014లో పోటీ చేయకపోయినా.. 2019లో పోటీ చేసిన రెండుచోట్లా ఓటమి పాలయ్యారు.2024 ఎన్నికల్లో మాత్రం బీజేపీ – టీడీపీతో జతకట్టిన కూటమిలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, డిప్యుటీ సీఎంగా ఎంపికయ్యారు, మంత్రిగా సేవలందిస్తున్నారు. ఇక పవన్ మాదిరిగా తమిళ స్టార్ విజయ్‌కి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఏడాది క్రితమే ప్రకటించినప్పటికీ… ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసిన పిమ్మట ఎంట్రీ ఇవ్వాలని భావించారు.. ఈ నేపథ్యంలో తాజాగా తన పార్టీ జెండాను విజయ్ ఆవిష్కరించారు.

విజయ్ పార్టీ “తమిళ వెట్రి కజగం” పార్టీ జెండా ఎరుపు, పసుపు రంగుల్లో రూపొందించారు. ఈ జెండా మధ్య భాగంలో జంట ఏనుగులు, పూలు ఉన్నాయి. ఇక నుంచి తమిళ వెట్రి కజగం పార్టీ జెండా దేశవ్యాప్తంగా ఎగురుతుందని.. అయితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన జనాలకు ఎప్పుడూ పెద్ద పీట వేస్తారనే పేరున్న తమిళ ప్రజానికం.. విజయ్ కు ఎలాంటి మద్దతు ఇస్తారని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే పవన్ కళ్యాణ్‌కి, విజయ్ పనితీరు దాదాపు ఒకే మాదిరిగా ఉంటాయి. కాకపోతే స్పందించే శైలి కాస్త భిన్నంగా ఉంటుంది అంతే
అయితే.. జయలలిత, కరుణానిధి ఇద్దరూ మరణించడంతో తమిళ రాజకీయాల్లో నాటి మజా లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒకానొక సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని అందరు విరమించుకున్నా ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారని అంటారు. ఇక కమల్ హాసన్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. సరిగ్గా ఇలాంటి సమయంలో… విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడంతో ఆయన ప్రభావం తమిళ రాజకీయాలపై ఎలా ఉంటుందనే చర్చ నడుస్తుంది. 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ఏ మేరకు ప్రభావం చూపిస్తారనేది తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. పైగా… జయలలిత లేని లోటును తమిళనాడు రాజకీయాల్లో విజయ్ పూడ్చగలుగుతారా లేదంటే పదేళ్లపాటు పవన్ కళ్యాణ్‌లా విజయ్‌కి సమయం పడుతుందా అని చర్చ నడుస్తుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram