Prakash Raj | తల్లి మరణం తర్వాత ప్రకాశ్ రాజ్‌పై తీవ్రమైన ట్రోలింగ్.. ఘాటు కౌంటర్ ఇచ్చిన విలక్షణ నటుడు
Prakash Raj | ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తల్లి స్వర్ణలత (86) ఇటీవల వయోభారంతో ఏర్పడిన అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఆమెకు మంగళవారం బెంగళూరులోని సెయింట్ మైఖేల్ చర్చిలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు హాజరై ఆమెకు చివరి నివాళులు అర్పించారు.
Prakash Raj | ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తల్లి స్వర్ణలత (86) ఇటీవల వయోభారంతో ఏర్పడిన అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఆమెకు మంగళవారం బెంగళూరులోని సెయింట్ మైఖేల్ చర్చిలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు హాజరై ఆమెకు చివరి నివాళులు అర్పించారు.
అయితే ఈ అంత్యక్రియల తర్వాత సోషల్ మీడియాలో ఒక వివాదం చెలరేగింది. తాను నాస్తికుడినని ప్రకటించిన ప్రకాష్ రాజ్, తన తల్లి అంత్యక్రియలను మతపరమైన విధానంలో ఎలా నిర్వహించారనే ప్రశ్నలు నెటిజన్ల నుంచి వచ్చాయి. ఒకరు ఆయన పాత ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను, అంత్యక్రియల వీడియోను కలిపి పోస్ట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.
ఘాటు సమాధానం..
ఈ విమర్శలకు ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. “నాకు దేవుడిపై నమ్మకం లేదు. కానీ మా అమ్మ తన దేవుడిని నమ్మేది. ఆమె నమ్మకాల ప్రకారం ఆమెకు అంత్యక్రియలు జరగాల్సిన హక్కు ఉంది. ఆ హక్కును నేను ఎందుకు కాదనాలి? ఒకరినొకరు గౌరవించుకోవడమే నిజమైన మానవత్వం” అంటూ ఘాటుగా స్పందించారు. ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే వారికి ఇది అర్థం కావడం కష్టం అని కూడా వ్యాఖ్యానించారు.
ఇంతకుముందు కూడా ఆయన తన కుటుంబ సభ్యుల నమ్మకాలపై స్పష్టత ఇచ్చారు. తన భార్య పోనీ వర్మ హిందూ సంప్రదాయాలను పాటిస్తుందని, తల్లి క్రైస్తవ మతాన్ని అనుసరిస్తుందని తెలిపారు. వారు చేసే పూజల్లోనూ, ఆచారాల్లోనూ తాను పాల్గొంటానని, ఎవరికీ హాని కలిగించనంత వరకు వారి విశ్వాసాలను గౌరవించడం తన బాధ్యత అని వెల్లడించారు.
ఎమోషనల్ అయిన ప్రకాశ్ రాజ్..
తల్లి మరణం ప్రకాష్ రాజ్‌ను తీవ్రంగా కలచివేసింది. ఆమెతో ఉన్న పాత ఫోటోను పంచుకుంటూ “ఈ కష్ట సమయంలో మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. అమ్మ.. నిన్ను చాలా మిస్ అవుతున్నాను” అంటూ భావోద్వేగంగా రాసుకొచ్చారు. గతంలో ఆమెకు బ్రెయిన్ సిస్ట్ సర్జరీ జరిగిన విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నారు.
సినిమాల విషయానికి వస్తే.. ప్రకాష్ రాజ్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. పలు భాషల్లో తెరకెక్కుతున్న చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ తన ప్రత్యేక నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram