Ravi Varma’s Yashoda and Krishna Art : రాజా రవివర్మ చిత్రానికి రూ. 167.2కోట్లు !

రాజా రవివర్మ యశోద-కృష్ణుడి పెయింటింగ్ రూ.167.2 కోట్లకు వేలంలో అమ్ముడు. భారతీయ కళాకృతుల్లో కొత్త రికార్డు సృష్టించింది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Apr 02, 2026, 2:55 pm IST
Read Time: 3 mins
Ravi Varma’s Yashoda and Krishna Art : రాజా రవివర్మ చిత్రానికి రూ. 167.2కోట్లు !

విధాత : ప్రముఖ భారతీయ చిత్రకారుడు రాజా రవివర్మ పెయింటింగ్స్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అందరికి తెలిసిందే. తాజాగా రవివర్మ గీసిన ఓ పెయింటింగ్‌ అరుదైన రికార్డును సృష్టించింది.యశోద, చిన్ని కృష్ణుడు ఉన్న ఆయిల్‌ పెయింటింగ్‌ వేలంలో రూ.167.2 కోట్లకు అమ్ముడయ్యింది.ముంబయిలో నిర్వహించిన సాఫ్రాన్‌ ఆర్ట్స్‌ స్ప్రింగ్‌ లైవ్‌ ఆక్షన్‌ లో రవివర్మ పెయింటింగ్ దక్కించుకునేందుకు అనేక మంది పోటీ పడ్డారు.

చివరకు వేలంలో పారిశ్రామిక వేత్త, సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా వ్యవస్థాపకులు సైరస్‌ ఎస్. పూనావాలా అరుదైన ఆ చిత్రాన్ని రికార్డు ధరకు దక్కించుకొన్నారు. 1890లో రవివర్మ గీసిన ఈ చిత్రాన్ని పూనావాల రూ.167 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ పెయింటింగ్‌ కొనుగోలు చేయడం ఎంతో గౌరవంగా ఉందని, ఇది తన కర్తవ్యం అని, ఇది జాతీయ సంప‌ద అంటూ పూనావాల మీడియాతో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

గతేడాది మరో ప్రముఖ భారతీయ చిత్రకారుడు ఎంఎఫ్‌ హుస్సేన్‌ గీసిన ఓ పెయింటింగ్‌ రూ.118 కోట్లకు అమ్ముడైన సంగతి తెలిసిందే. అత్యంత ఖరీధైన భారతీయ కళాకృతిగా ఇప్పటివరకు హుస్సెన్ పెయింటింగ్ కొనసాగగా.. తాజాగా ఆ రికార్డును రవివర్మ పెయింటింగ్ బద్దలుకొట్టడం విశేషం. హుస్సెన్ ఆన్ టైటిల్డ్ (గ్రామ్ యాత్ర) పెయింటింగ్ ప్రముఖ వేలం సంస్థ క్రిస్టీ న్యూయార్క్‌లో నిర్వహించిన వేలంలో..(రూ.118 కోట్లకు)13.8 మిలియన్ డాలర్లకు అమ్ముడు పోయింది. 14 అడుగుల సుదీర్ఘ చిత్రపటం గ్రామీణ భారత జీవితాన్ని ప్రతిబింబించడం ద్వారా అందరి దృష్టికి ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి :

Mee Seva : తెలంగాణ మీసేవ కేంద్రాల సర్వీసు ధరల పెంపు
HAM Roads Scam : హ్యామ్‌ మోడల్ కాదు.. కాంగ్రెస్ స్కామ్‌ మోడల్!