HAM Roads Scam : హ్యామ్ మోడల్ కాదు.. కాంగ్రెస్ స్కామ్ మోడల్!
మూసీ సుందరీకరణకు ఎన్జీటీ గ్రీన్ సిగ్నల్. పిటిషన్ కొట్టివేతతో రేవంత్ సర్కార్‌కు ఊరట. రూ.50 వేల కోట్ల ప్రాజెక్ట్ వేగం పుంజుకోనుంది.
విధాత, హైదరాబాద్ : హ్యామ్ రోడ్లతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.8వేల కోట్ల స్కామ్ కు పాల్పడుతుందని బీఆర్ఎస్ వరుస విమర్శల దాడి కొనసాగిస్తుంది. ముఖ్యంగా రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హ్యామ్ రోడ్ల టెండర్లు..పనులపై బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా దాడి కొనసాగిస్తుంది. ముందుగా మాజీ మంత్రి,బీఆర్ఎస్ శాసన సభ పక్ష డిప్యూటీ లీడర్ టి.హరీశ్ రావు హ్యామ్ రోడ్ల నిర్మాణం మాటున కాంగ్రెస్ సర్కార్ రూ.18వేల కోట్ల స్కామ్ కు పాల్పడుతుందంటూ ఆరోపించారు. దీనిపై స్పందించిన ఆర్ ఆండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హరీశ్ రావు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ.. అసెంబ్లీ లోపల, బయట కూడా వివరణ ఇచ్చారు. మంత్రి వెంకట్ రెడ్డి వివరణ తర్వాత కూడా బీఆర్ఎస్ హ్యామ్ రోడ్ల వ్యవహారంలో భారీ స్కామ్ జరుగుతుందంటూ తన ఆరోపణలను కొనసాగిస్తుండటం ఆసక్తి రేపుతుంది. తాజాగా బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి సైతం హ్యామ్ రోడ్ల పనుల్లో స్కామ్ కొనసాగుతుందంటూ ఆరోపించారు. అటు అసెంబ్లీలో వెంకట్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం హ్యామ్ రోడ్ల పనులపై అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ వ్యవహారం పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఇది హ్యామ్ మోడల్ కాదు.. పక్కా కాంగ్రెస్ స్కామ్ మోడల్!
కొత్త రోడ్ల అభివృద్ధి అంటూ హ్యామ్ పేరిట రూ. 8వేల కోట్ల దోపిడీకి రేవంత్ సర్కార్ తెరలేపిందంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. 10శాతం మొబలైజేషన్ అడ్వాన్స్ పద్దతిని తీసుకొచ్చి కొత్త రకం దోపిడికి పాల్పడుతుందని, కిలో మీటర్ రోడ్డు విస్తరణకు రూ.1.75కోట్ల ఖర్చు అయితే.. హ్యామ్ లో రూ. 3.30కోట్లు చూపిస్తూ ప్రజాధనం లూటీ చేస్తున్నారని ఆరోపించింది. ఇది హ్యామ్ మోడల్ కాదు..పక్కా కాంగ్రెస్ స్కామ్ మోడల్ అంటూ విమర్శలు గుప్పిస్తుంది. అటు కోమటిరెడ్డి సైతం తగ్గకుండా బీఆర్ఎస్ ఆరోపణలపై కౌంటర్ ఎటాక్ కొనసాగిస్తూ ఈ వివాదంలో వేడి పెంచుతున్నారు. మాజీ మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, కేటీఆర్ లు హ్యామ్ రోడ్లపై అవినీతి జరిగిందంటూ చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలంటూ కొట్టిపారేస్తున్నారు. తాను 2025ఆక్టోబర్ 25వ తేదీనే హ్యామ్ రోడ్ల పనులపై వివరణ ఇచ్చానని,అయినా బీఆర్ఎస్ నేతలు మళ్లీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. నాపై ఇప్పటిదాక చిన్న అవినీతి మరక లేదని, నాకు అవినీతి చేయాల్సిన అవసరం లేదన్నారు. నా శాఖలో అవినీతి జరిగితే చూస్తు ఊరుకునేది లేదంటూ స్పష్టం చేశారు. రూ.13,006కోట్లతో 6,097కిలోమీటర్ల మేరకు హ్యామ్ పద్దతిలో రోడ్ల నిర్మాణం కొనసాగుతుందని వెల్లడించారు. ఆర్ఆండ్ బీలో బీఆర్ఎస్ చేసిన నిర్వాకం, అవినీతిపైన విచారణ కొనసాగుతుందని తెలిపారు. రోడ్డు డెవలప్ మెంట్ కార్పోరేషన్ లో చేసిన అవినీతిపైన, సచివాలయం నిర్మాణం రూ. 617కోట్ల నుంచి రూ.1000కోట్లకు ఎలా పెరిగిందో చెప్పాలని, దీనిపైన చర్చిద్దామా అంటూ సవాల్ చేశారు.
ఇవి కూడా చదవండి :
ఆలేరు నియోజకవర్గంలో కాళేశ్వరం జలాల సందడి!
Musi Beautification Project | మూసీ సుందరీకరణపై రేవంత్ సర్కార్ ఊరట!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram