Mee Seva : తెలంగాణ మీసేవ కేంద్రాల సర్వీసు ధరల పెంపు

తెలంగాణలో మీసేవ కేంద్రాల సర్వీసు ఛార్జీలు సుమారు 50% పెరిగాయి. సర్టిఫికెట్ల జారీకి రుసుములు పెరగడంతో ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడనుంది.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Apr 01, 2026, 5:17 pm IST
Read Time: 2 mins
Mee Seva : తెలంగాణ మీసేవ కేంద్రాల సర్వీసు ధరల పెంపు

విధాత, హైదరాబాద్ : తెలంగాణలో మీసేవ కేంద్రాల సర్వీసు ధరలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అన్ని సర్వీసులపై సుమారు 50 శాతం ధరలు పెంచారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆదాయ, కుల, స్థానికత వంటి సర్టిఫికెట్ల జారీకి రుసుం రూ.80 చేశారు. జనన ధ్రువీకరణ పత్రం ప్రింట్‌ ఇవ్వడానికి రుసుం రూ.62 చెల్లించాల్సి ఉంటుంది.

ఇప్పటికే పశ్చిమాసియా యుద్దం నేపథ్యంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు ఇతర సరుకుల ధరలు పెరిగి అదనపు ఆర్థిక భారం మోస్తున్న ప్రజలకు మీసేవా చార్జీల రూపంలో మరింత అదనపు భారం వేయడం పట్ల ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి :

Petrol Diesel Price Hike : పెట్రోల్, డీజిల్ ధరలు పెంచం :కేంద్రం
Amaravati Capital Bill : రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం