Petrol Diesel Price Hike : పెట్రోల్, డీజిల్ ధరలు పెంచం :కేంద్రం

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేసింది. చమురు, గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందవద్దని తెలిపింది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Apr 01, 2026, 5:44 pm IST
Read Time: 2 mins
Petrol Diesel Price Hike : పెట్రోల్, డీజిల్ ధరలు పెంచం :కేంద్రం

న్యూఢిల్లీ : దేశంలో చమురు, పెట్రోలియం,నేచురల్‌ గ్యాస్‌ నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ జాయింట్‌ కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. ఇంధన సరఫరా సమస్యలపై ప్రజలు ఆందోళన చెంది అధికంగా కొనాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దేశంలో చమురు, పెట్రోలియం,నేచురల్ గ్యాస్ నిల్వలు 2 నెలలకు సరిపడా ఉన్నాయని వెల్లడించారు.

ఇంధన ధరలు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. క్రూడాయిల్‌ ధర 100 డాలర్లు దాటినా కేంద్రం ధరలు పెంచలేదని గుర్తు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయన్న ప్రచారంలో వాస్తవం లేదని.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై ఎలా పెరుగుదల ఉండదని స్పష్టం చేసింది. పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్‌తో ఇప్పటికే దేశంలో పవర్ పెట్రోల్ ధరలు పెరిగినందునా..సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగాతాయన్న ప్రచారం నేపథ్యంలో కేంద్రం క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు డొమెస్టిక్‌ ఎల్పీజీ ధరలు కూడా పెంచే ఉద్దేశం లేదని సుజాత శర్మ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి :

Auto Drivers Protest In Hyderabad | ఎల్పీజీ కొరతపై భగ్గుమన్న ఆటో కార్మికులు
LPG Shortage | ఆయిల్ కంపెనీలపై అంతులేని ప్రేమ… నిద్రపోతున్న పౌర సరఫరాల విభాగం