Prakash Raj | విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట విషాదం.. తల్లి సువర్ణలత కన్నుమూత, సంతాపం తెలిపిన పవన్
Prakash Raj | విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన మాతృమూర్తి సువర్ణలత (86) సోమవారం ఉదయం బెంగళూరులోని స్వగృహంలో కన్నుమూశారు. వయోభారం సమస్యలతో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆమె ఆరోగ్యం విషమించడంతో తుది శ్వాస విడిచారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు, ఈ రోజు సాయంత్రం బెంగళూరులోనే ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

కష్టాల మధ్య ఎదిగిన జీవితం
సువర్ణలత జీవితం చిన్నప్పటి నుంచే ఎన్నో కష్టాలతో నిండిపోయింది. ఆమె అనాథగా పెరిగి, తరువాత ఆసుపత్రిలో నర్సుగా పనిచేశారు. ఈ సమయంలో పరిచయమైన వ్యక్తితో ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు సంతానం కలిగారు. అందులో మొదటి సంతానం ప్రకాశ్ రాజ్. కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉండటంతో పిల్లల పెంపకం ఎంతో కష్టంగా సాగింది.
నాటక రంగం నుంచి సినీ రంగానికి ప్రయాణం
పేదరికం కారణంగా చిన్నప్పటినుంచే ప్రకాశ్ రాజ్ నాటక రంగంలోకి అడుగుపెట్టారు. కుటుంబ పోషణ కోసం స్టేజ్ ప్రదర్శనలు చేస్తూ తన ప్రతిభను మెరుగుపరుచుకున్నారు. తరువాత ప్రముఖ దర్శకుడు కే. బాలచందర్ ఆయనలోని నటుడిని గుర్తించి సినీ రంగానికి పరిచయం చేశారు. తమిళ చిత్రం డ్యూయెట్ ద్వారా వెండితెరకు పరిచయమైన ఆయన, సంకల్పం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు.
బహుముఖ నటుడిగా గుర్తింపు
హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అనేక విభిన్న పాత్రల్లో మెప్పించిన ప్రకాశ్ రాజ్, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నటించి విశేష ఖ్యాతి గడించారు. మూడు దశాబ్దాలకుపైగా సినీ ప్రయాణంలో వందలాది చిత్రాల్లో నటించారు. ఆయనకు ఐదు జాతీయ అవార్డులు, పలు రాష్ట్ర స్థాయి పురస్కారాలు లభించాయి.
ఇటీవల సరస్వతి సినిమాలో కనిపించిన ఆయన, ప్రస్తుతం మహేష్ బాబు – ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న వారణాసి చిత్రంలో నటిస్తున్నారు. ప్రకాశ్ రాజ్ తల్లి మరణ వార్తతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబానికి ధైర్యం చెబుతున్నారు.
పవన్ సంతాపం..
ప్రముఖ నటుడు శ్రీ ప్రకాష్ రాజ్ గారి మాతృమూర్తి శ్రీమతి సువర్ణలత గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. శ్రీమతి సువర్ణలత గారు ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. మాతృ వియోగానికి లోనైన శ్రీ ప్రకాష్ రాజ్ గారికి, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అంటూ పవన్ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి :
Prakash Raj | విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట విషాదం.. తల్లి సువర్ణలత కన్నుమూత, సంతాపం తెలిపిన పవన్
Kiara Advani | మాతృత్వం నన్ను ‘ఆడపులి’గా మార్చింది.. కియారా అద్వానీ భావోద్వేగ వ్యాఖ్యలు వైరల్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram