Pawan Kalyan| పవన్ ఓడిపోతాడని ఆ నిర్మాత బెట్టింగ్ వేశాడా.. పది కోట్లు పోవడంతో…!
Pawan Kalyan| ఇన్నాళ్లు సినిమాలలో ఉంటూ మంచి విజయాలు అందుకొని స్టార్ హీరోగా ఎదిగిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాలలో కూడా తనసత్తా చాటాడు. గత ఎలక్షన్స్‌లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన జనసేనాని ఈ సారి మాత్రం భారీ మెజారిటీతో గెలిచాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భా
Pawan Kalyan| ఇన్నాళ్లు సినిమాలలో ఉంటూ మంచి విజయాలు అందుకొని స్టార్ హీరోగా ఎదిగిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాలలో కూడా తనసత్తా చాటాడు. గత ఎలక్షన్స్‌లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన జనసేనాని ఈ సారి మాత్రం భారీ మెజారిటీతో గెలిచాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో పిఠాపురంలో గెలవడమే కాక ఆయన పార్టీ తరపున నిల్చున్న 21 మంది ఎమ్మెల్యేలు, రెండు ఎంపీలు గెలిచారు. దీంతో అభిమానులు, కార్యకర్తలు సంబరాలు అంబరాన్నంటాయి. పవన్‌కి సినీ, రాజకీయ ప్రముఖుల నుండి అభినందనలు వెల్లువెత్తాయి. ఇక ఎన్నికలలో గెలిచిన తర్వాత పవన్.. చంద్రబాబు, నరేంద్ర మోదీ, చిరంజీవి వంటి వారిని కలిసారు.

అయితే ఈ సారి ఏపీ ఎన్నికలు ఎంత రసవత్తరంగా మారాయో మనం చూశాం. ఈ ఎన్నికలపై క్రికెట్ బెట్టింగ్‌లని మించి బెట్టింగ్ జరిగినట్టు తెలుస్తుంది. కొందరు లక్షలు పెడితే మరి కొందరు కోట్లు కూడా పోగొట్టుకున్నారట. అయితే కూటమి గెలుపుపై కొందరు బెట్టింగ్ పెడితే మరి కొందరు వైసీపీ గెలుపుపై బెట్టింగ్ పెట్టారు. ఈక్రమంలోనే టాలీవుడ్ బడా నిర్మాత ఒకరు బెట్టింగ్ లో 10 కోట్లు పొగోట్టుకున్నాడట. ఫలానా పార్టీ అధికారంలోకి వస్తుందని చాలామంది రాజకీయ నాయకులు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా భారీగా పందాలు వేసినట్టు తెలుస్తుండగా, బడా నిర్మాత పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేఖంగా బెట్టింగ్ పెట్టాడన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
2024 ఏపీ ఎన్నికలలో వైసీపీ గెలుస్తుందని, పవన్ ఓడిపోతాడని పందెం వేశాడట. వైసీపీకి అనుకూలంగా.. పవన్ కు వ్యతిరేకంగా పందెం వేసి.. ఆ నిర్మాత భారీగా నష్టపోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం నిజం ఎంత ఉందో తెలియదు కాని.. ఫిల్మ్ సర్కిల్ లో మాత్రం దీని గురించే ముచ్చటించుకుంటున్నారు. సినిమా వాడు అయి ఉండి పవన్ ఓడిపోతాడని ఎలా పెట్టాడు, మంచి శాస్తే జరిగిందంటూ కొందరు ముచ్చటించుకుంటున్నారు. ఏది ఏమైన ఈ వార్తలో ఎంత నిజం ఉందనేది తెలియకపోయిన సోషల్ మీడియాలో సైతం ఈ వార్త తెగ హల్‌చల్ చేస్తుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram