విధాత :యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో శర్వానంద్ తన 30వ చిత్రాన్ని నూతన దర్శకుడు శ్రీ కార్తిక్ దర్శకత్వంలో చేస్తున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్నాడు.
ఈ రోజు ఫస్ట్‌లుక్ పోస్టర్ ను విడుదలచేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రానికి ఒకే ఒక జీవితం అనే టైటిల్‌ను కన్ఫర్మ్ చేశారు. సైన్స్‌ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతుంది.
శర్వానంద్ వెనకాల గిటార్ వేసుకుని ఉండడం ఈ పోస్టర్లో మనం చూడొచ్చు. ఈ పోస్టర్‌లో ఒక వైపు
పచ్చదనం, పోస్టాఫీసు, లేఖ, మ్యూజిక్ క్యాసెట్, గాలిపటాలు మొదలైనవి చూపించారు. మరొక వైపు
కర్మాగారాలు, సెల్ టవర్, మొబైల్, మ్యూజిక్ సిస్టమ్, ఫ్లైట్ ని చూపించారు. ఈ పోస్టర్ గ్లోబలైజేషన్
ప్రభావాన్ని వివరించేలా ఉంది.
శర్వానంద్ సరసన తెలుగమ్మాయి రీతు వర్మహీరోయిన్ గా నటిస్తుండగా వెన్నెల కిషోర్, ప్రియదర్శి
సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని అమల ఒక కీలక పాత్రలో నటిస్తుండడం
విశేషం. ఇప్పటికే ఒకే ఒక జీవితం మూవీ షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
Latest News
కేసుల పాలు చేసిన సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నిక
కుంగిన జాతీయ రహదారి.. ఇరుక్కపోయిన వాహనాలు
13వ వారం ఊహించని ఎలిమినేషన్…
ఇండిగో బాధిత ప్రయాణికులకు రైల్వే, ఆర్టీసీ బాసట!
ఎడారి పాము ఎత్తులు ఎన్నో..క్షణాల్లో ఇసుకలోకి!
కొత్త బిజినెస్‌లో ఆ హీరో సెన్సేషన్
ప్రపంచంలోనే పొడవైన ఎయిర్ రూట్ ప్రారంభం!
ఇండిగో సంక్షోభానికి కేంద్రమే కారణం: సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు..
ఇంటర్నేషనల్ గ్లోబల్ సమ్మిట్ కు హైదరాబాద్ సన్నద్దం
గుమ్మడి నర్సయ్య సినిమా షూటింగ్ ప్రారంభం..తరలొచ్చిన జనం