Akhanda 2 : తెలంగాణలో ‘అఖండ 2’ ధరల పెంపు
అఖండ2: తాండవం టికెట్ ధరలు తెలంగాణలో పెరిగాయి. సింగిల్ స్క్రీన్‌కి రూ.50, మల్టీప్లెక్స్‌కి రూ.100 అదనంగా వసూలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
విధాత, హైదరాబాద్ : సీనియర్ హీరో బాలకృష్ణ కథానాయకుడిగా.. అఖండ మూవీకి సీక్వెల్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అఖండ2: తాండవం’ సినిమా ఈ డిసెంబర్ 5న విడుదలకు సిద్దమైంది. సినిమా యూనిట్ విజ్ఞప్తి మేరకు తెలంగాణ ప్రభుత్వం ‘అఖండ2’ మూవీ టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.
సింగిల్ స్క్రీన్‌లో రూ.50, మల్టీ ప్లెక్స్‌లో రూ.100ధర పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. డిసెంబరు 4న రాత్రి 8 గంటల ప్రీమియం షోకు కూడా అనుమతి ఇచ్చింది. ఈ టికెట్ ధరను రూ.600గా నిర్ణయించారు. అయితే, పెంచిన ధరలు విడుదల తేదీ నుంచి కేవలం మూడు రోజులు మాత్రమే అమల్లో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. సనాతన ధర్మ పరిరక్షకుడిగా బాలయ్య అఘోర పాత్రతో పాటు మురళికృష్ణ పాత్రలో ద్విపాత్రాభినయం చేశారు. హీరోయిన్ గా సంయుక్త మీనన్, కీలక పాత్రలో హర్షాలీ మెహతా, విలన్ గా ఆది పినిశెట్టిలు నటించారు.
ఇవి కూడా చదవండి :
Srikanth Chary : శ్రీకాంత్ చారి వర్ధంతి జరుపుకొనివ్వడం లేదు: తల్లి శంకరమ్మ
Sama Ram Mohan Reddy : కిషన్ రెడ్డి ఒక బ్రోకర్..కిరికిరి రెడ్డి
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram