విప్లవ వీరుడు.. షూటింగ్ షురూ
భారత స్వాతంత్య్ర పోరాటంలో సామాన్య ప్రజల పాత్రను ప్రతిబింబించేలా రూపొందుతున్న హిస్టారికల్ చిత్రం ‘విప్లవ వీరుడు’ షూటింగ్‌కు ఘనంగా శ్రీకారం చుట్టింది.
భారత స్వాతంత్య్ర పోరాటంలో సామాన్య ప్రజల పాత్రను ప్రతిబింబించేలా రూపొందుతున్న హిస్టారికల్ చిత్రం ‘విప్లవ వీరుడు’ షూటింగ్‌కు ఘనంగా శ్రీకారం చుట్టింది. ప్రముఖ నటి ఇంద్రజ కీలక పాత్రలో, జైశ్వర్–సోనాలి ప్రధాన జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్. నాగరాజ్ రావు దర్శకత్వంలో ఏవీ జయరాం నిర్మిస్తున్నారు. ఫిలింనగర్ దైవసన్నిధానంలో పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. ముహూర్తం షాట్‌కు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ క్లాప్ కొట్టగా, ఇంద్రజపై తొలి సన్నివేశం చిత్రీకరించారు.
ఈ సందర్భంగా నటి ఇంద్రజ మాట్లాడుతూ, స్వాతంత్య్ర ఉద్యమంలో సామాన్యుల ధైర్యసాహసాలను నిజాయితీగా చూపించే కథ ఇది అన్నారు. రాణి భవానిదేవి పాత్రలో తాను కనిపించనున్నానని, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని చిత్రంలో ప్రతిబింబిస్తామని చెప్పారు. అర్థవంతమైన కథతో నిర్మాత మంచి ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. హీరో జైశ్వర్ మాట్లాడుతూ, విప్లవ వీరుడు పాత్ర తనకు ఎంతో ప్రత్యేకమని, ఈ సినిమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హీరోయిన్ సోనాలి, తన మొదటి చిత్రంగా ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
దర్శకుడు ఎస్. నాగరాజ్ రావు మాట్లాడుతూ, ఇది తన కలల ప్రాజెక్ట్ అని, బ్రిటిష్ కాలం నేపథ్యంలో నిజ జీవితానికి దగ్గరగా ఉండే కథను తెరపైకి తీసుకొస్తున్నామని చెప్పారు. నిర్మాత ఏవీ జయరాం మాట్లాడుతూ, టిప్పు సుల్తాన్ కాలం నాటి సంఘటనలతో బ్రిటిష్ వారి దోపిడీ విధానాలను సినిమాలో చూపించనున్నామని తెలిపారు. నటుడు పటేల్ అశోక్ రెడ్డి మాట్లాడుతూ, స్వేచ్ఛ కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను గుర్తుచేసే ప్రయత్నంగా ఈ సినిమా నిలుస్తుందని అన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram